*కాంగ్రెస్ పార్టీపై సీఈఓ వికాస్ రాజ్ కు బీఆర్ఎస్ లీగల్ టీం ఫిర్యాదు
తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ను బీఆర్ఎస్ లీగల్ టీమ్ కలిసింది. రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీని కించపరిచే విధంగా కాంగ్రెస్ యాడ్స్ ను ఆపాలని సీఈవోకు కంప్లైంట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు సోమా భరత్ మాట్లాడుతూ.. పచ్చగా ఉన్న తెలంగాణను హింసాత్మకంగా చేసేందుకు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోంది అని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.. క్యాడర్ ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని సోమా భరత్ అన్నారు. వారం రోజుల్లో దుబ్బాక, అచ్చంపేట ఘటనలు జరిగాయని బీఆర్ఎస్ లీగల్ టీం తెలిపింది. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికీ సీరియస్ గానే ఉన్నారు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులు జరిగితే రేవంత్ రెడ్డి కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు.. పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో ఎక్కడైనా ఘటనలు జరిగాయా? అని ప్రశ్నించారు. ఇప్పుడు జరుగుతున్న ఘటనలు ఎవరి వల్ల జరుగుతున్నాయో ప్రజలు ఆలోచన చేయాలి.. రేవంత్ కు టీడీపీ తల్లిపార్టీ అయితే.. కాంగ్రెస్ అత్తపార్టీ అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి అంతర్గత ఒప్పందం కుదిరింది.. స్టార్ క్యాంపెనియర్ గా ఉన్న రేవంత్ రెడ్డి భాష పద్ధతిగా ఉండాలి.. ఎంసీసీ కమిటీకి చూపించిన ప్రకటనలు ఒకటి.. బయట ప్రచారం మరొకటి చేస్తున్నారు.. ఎదైనా కన్ఫ్యూజన్ ఉన్న అంశాలపై ఈసీ క్లారిటీ ఇస్తే బాగుంటుందని బీఆర్ఎస్ లీగల్ టీమ్ తెలిపింది.
*నేను ఆమరణ నిరహర దీక్ష చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. స్వాత్రంత్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది.. ప్రజాస్వామ్యంలో మెచ్యూరిటీ మన దేశంలో ఇంకా రాలేదు అని ఆయన వ్యాఖ్యనించారు. ఎలక్షన్ వచ్చాయి అంటే ఆగం ఆగం కావొద్దు.. అభ్యర్ధి గుణం గణం పరిగణలోకి తీసుకోవాలి.. అభ్యర్ధుల వెనుక ఎ పార్టీ ఉన్నది.. ఆ పార్టీ చరిత్ర ఏంటి అనేది గ్రామల్లో పట్టణల్లో చర్చ జరగాలి.. అప్పుడే నాయకుడ్ని ఎన్నుకునే విధానం జరుగుతుంది.. మన దేశంలో ఎలక్షన్ వచ్చింది అంటే అబద్దాలు మోసాలు చేస్తున్నారు.. ఇలాంటివి పోవాలి మంచి జరగాలి అంటే గ్రామాల్లో అభివృద్ధి చేసిన పార్టీ గురించి చర్చ జరగాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు మనకి మూడోసారి ఎన్నిక జరుగుతుంది అని సీఎం కేసీఆర్ తెలిపారు. న్యాయబద్దంగా 2005 లోనే తెలంగాణ రావాల్సి ఉంది.. నేను ఆమరణ నిరహర దీక్ష చేస్తే కేసిఆర్ చచ్చుడో తెలంగాణ రావోడో అనే దీక్ష చేస్తే చచ్చినట్లు తెలంగాణ ఇచ్చారు.. తెలంగాణ వచ్చిన తరువాత కరెంట్ సమస్య తీర్చుకున్నామన్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.. ఇంటింటికి మిషన్ భగీరద ద్వారా నీళ్ళు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కేసీఆర్ అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీరు అందించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నాడు చూడలేదు …బీఅరెస్ పార్టీ వచ్చినకనే ఆలోచన చేశాం…ఉమ్మడి జిల్లా ప్రజలకు సీతమ్మ సాగర్ నీళ్ళు అందిస్తాం.. రైతుల కోసం రైతు బంధు తీసుకొచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. పావు ఏకారం భూమి ఉన్న రైతన్నకి కూడా రైతు భీమా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కేసీఆర్ వెల్లడించారు. ధరణి పొట్రాల్ ద్వారా అద్బుతాలు జరుగుతున్నాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణి తీసి బంగాళాఖాతం లో వేస్తాం అని అంటున్నారు.. వాళ్ళు వచ్చేది లేదు చచ్చేది లేదు.. ధరణిపుణ్యం వల్ల దళారి వ్యవస్థ పోయింది.నేరుగా సమస్య పరిష్కరం అవుతుంది.. ధరణి తీసేస్తే మళ్ళీ ఫైరావీకారులు దళారీ చేతులోకి పోతుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి మార్చేస్తాం అంటున్న పార్టీ ల వైఖరి ఎంటో చూడండి.. గుడ్డిగా చెప్పే మాటాలు నమ్మి ఓట్లు వెయ్యకండి.. రైతుబందువు ఇచ్చి కేసిఆర్ దుబరా చేస్తున్నడని ఉత్తమ్ అంటున్నాడు.. రైతుబందువు దుబారానా అని ప్రజలను ప్రశ్నించిన కేసిఆర్.. ఆలోచించకుండా ఓటు వేస్తే ఆగం అవుతాం…మూడు గంటల కరెంట్ వస్తుంది.. 24 గంటల కరెంట్ ఉండాలి అంటే మెచ్చా గెలవాలి అని కేసీఆర్ పేర్కొన్నారు.
*సిద్ధంగా ఉండండి.. కాంగ్రెస్ నేతలకు అక్బరుద్దీన్ హెచ్చరిక
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య మాటల పటాకులు పేలుతున్నాయి. ఈ క్రమంలో వేలం పాటకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హెచ్చరించారు. ఇక నుంచి పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. నేను ప్రసంగిస్తే దేశమంతా వణికిపోయిందని అన్నారు. సాయంత్రం నుంచి మిమ్మల్ని వేలం పాడుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మీరు వేలం పాటకు సిద్ధంగా ఉండండాలని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ మాట్లాడుతూ.. అసదుద్దీన్ ఓవైసీ తన షేర్వానీ లోపల పైజామా ఉందనుకున్నానని కానీ.. లోపల ఖాకీ నిక్కర్ ఉందని అర్థమైంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ముస్లిం హక్కుల కోసం కొట్లాడాలని అసదుద్దీన్ తండ్రి ఆయన్ని బారిష్టర్ చదివించారు. కానీ.. అసదుద్దీన్ ముస్లింలను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి మద్దతుగా ఉంటున్నారన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రాజాసింగ్‌పై మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు? అంటూ రేవంత్ ప్రశ్నించారు. కాగా.. కేసీఆర్, మోడీ లాంటి దొంగలను కాపాడడానికి ఓవైసీ అబద్ధాలు చెప్తున్నారని రేవంత్ ఆరోపించారు. కాగా.. ఈ క్రమంలోనే.. అసద్దుద్దీన్‌కు రేవంత్ సవాల్ విసిరారు.. కర్ణాటక ఎన్నికల సమయంలో మోడీ, అమిత్ షాకు సన్నిహితుడైన ఓ కీలక వ్యక్తికి తన ఇంట్లో ఓవైసీ పార్టీ ఇచ్చారని సంచలన ఆరోపించారు. ఆ కీలక వ్యక్తికి పార్టీ ఇవ్వలేదని ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్దమా? అని రేవంత్ ఛాలెంజ్ చేశారు. అంతేకాకుండా.. తాను హిందువునని భాగ్యలక్ష్మి గుడికి వెళ్తా.. దర్గాకి రమ్మన్నా వస్తానంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మక్కా మసీదులో ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. నేను శుక్రవారం రోజు మక్కా మసీదుకు వస్తానని.. ఖురాన్ పట్టుకొని ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్ధమా అంటూ రేవంత్ ఛాలెంజ్ విసిరారు.
*ట్రెండింగ్‌లో సీఎం జగన్ ఫొటో.. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమానికి భారీ మద్దతు
ఏపీలో అధికార పార్టీ వైసీపీ రెండో సారి అధికారంలోకి రావడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఎక్కడ ఏ చాన్స్ వదలకుండా అన్నింటిపై ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పుడు మరో సారి అధికారం దక్కించుకోవాలని, పార్టీని పరుగులు పెట్టించాలని సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ గురించి ప్రభుత్వం గురించి సానుకూలంగా సోషల్ మీడియా ద్వారా జనంలోకి తీసుకుపోవడం ద్వారా వైసీపీకి మరోసారి విజయాన్ని దక్కించుకోవడానికి పార్టీ ఈ ప్లాన్ వేసింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉండగా.. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమానికి మద్దతుగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు సోషల్ మీడియాలో భారీగా పోస్టులు చేస్తున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ వైసీపీ శ్రేణులు సీఎం జగన్ ఫొటోను ట్రెండ్ చేస్తున్నారు. “నవరత్నాలు, రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, బీసీలకు 50 శాతం ఎంపీ సీట్లు, 17 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 30 లక్షల ఇళ్లపట్టాలు, సచివాలయాలు, రూ.1కే టిడ్కో ఇళ్లు సహా ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరగాలంటే జగనే రావాలి” అని సీఎం జగన్ ఉన్న ఫొటోను వైసీపీ శ్రేణులు ట్రెండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. వైసీపీ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. వైసీపీ సోషల్ మీడియా సైన్యం ట్విటర్‌ను ఊపేస్తోంది. పాలనలో వైయస్ జగన్ ప్రభుత్వం సాధించిన విజయాలు, ఆయన రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన సమాచారంతో ట్వీట్లను నెటిజెన్లు షేర్ చేస్తున్నారు. ఆ ట్వీట్లను పార్టీ కార్యకర్తలు షేర్ చేస్తున్నారు. ఈ ట్వీట్లకు దేశవ్యాప్తంగా భారీగా వ్యూస్ వస్తున్నాయి.
*నాంపల్లి బాధితులకు ఒక్కొక్కిరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా
నాంపల్లి అగ్నిప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అంతకుముందు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం.. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.. వారికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గాయపడిన వాళ్లకు సరైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘటన స్థలానికి ఐటీ శాఖ మంత్రికి కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ యాదవ్ తలసాని పరిస్థితి పరిశీలించారు. ఇవాళ ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లి బజార్ ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. బజార్ ఘాట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారితో సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భవనం కింది భాగంలో రసాయనాలను నిల్వ చేయడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే భవనం మొత్తం మంటల్లో చిక్కుకుని తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.
*వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేయనున్న సీఎం జగన్
ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలోని మాచర్లలో పర్యటించనున్నారు. వరికపూడిసెల ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు. మాచర్ల చెన్నకేశవ కాలనీ సభాస్ధలి వద్ద వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మాచర్ల నియోజకవర్గంలో వరికపూడిసెల ప్రాజెక్టు పనులకు ఈ పర్యటన లో శ్రీకారం చుట్టనున్నారు. ఈ తరుణంలో మాచర్లలోని రాయవరం జంక్షన్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. సభలో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. కరువు మండలాల ప్రకటనకు, పంటల బీమాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూట మూడు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడంపై రైతులు, ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై సీఎం జగన్ తాజాగా స్పందించారు. అర్హులైన రైతులందరికీ పంటల బీమా వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు.
*బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి చేసిన బీఆర్ఎస్ సర్పంచ్ అండ్ ఫ్యామిలీ
మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య సంగీత నాయక్ పై బీఆర్ఎస్ సర్పంచ్ అతని కుటుంబ సభ్యులు దాడి చేశారు. నరసింహుల పేట మండలం గోపాతండా వద్ద ఘటన చోటు చేసుకుంది. నరసింహుల పేట మండలంలోని పెద్ద నాగారం గ్రామ శివారు తండాలో ప్రచారాన్ని కొనసాగించిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య సంగీత నాయక్.. అదే తండాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పర్యటించారు. రాజకీయ గురువుపై నర్సింహులపేట మండల జడ్పీటీసీ భూక్యా సంగీత నాయక్ పోటీకి దిగాడు. దీంతో గత కొన్ని రోజులుగా జడ్పీటీసీ సంగీతను పార్టీకి ఎమ్మెల్యే రెడ్యానాయక్ దూరం పెట్టారు. దీంతో భూక్య సంగీత నాయక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈటెల రాజేందర్ సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నుండి డోర్నకల్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న సంగీత.. నామినేషన్ వేసిన తదుపరి ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానిక మహిళలతో గిరిజన సాంప్రదాయ నృత్యం చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి సంగీతను సర్పంచ్ భర్త నెట్టివేశాడు. ఓటమి భయంతోనే దాడి చేసినట్లుగా సంగీత నాయక్ ఆరోపిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్- బీజేపీ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
*9 మైతీ తీవ్రవాద గ్రూపులపై ఐదేళ్లపాటు నిషేధం.. కేంద్రం కీలక నిర్ణయం
మణిపూర్‌లో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిటీ యొక్క తీవ్రవాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)ని ఐదేళ్లపాటు చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించింది. అంతేకాకుండా.. ఆ పార్టీ రాజకీయ విభాగాలైన రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ (RPF), యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF)లను కూడా ఐదేళ్లపాటు చట్టవిరుద్ధమైన సంస్థలుగా హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు.. PLA ఆర్మీ వింగ్ మణిపూర్ పీపుల్స్ ఆర్మీ (MPA)పై కూడా ఈ చర్య తీసుకున్నారు. పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కంగ్లీపాక్ (PREPAK), రెడ్ ఆర్మీ, కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (KCP)లకు కూడా హోం మంత్రిత్వ శాఖ ఐదేళ్లపాటు నిషేధించింది. మే 3న కుకీ, మెయిటీ కమ్యూనిటీల ప్రజల మధ్య ఘర్షణలతో మణిపూర్ హింసాత్మక జ్వాలలతో అట్టుడికింది. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. అంతేకాకుండా.. హింస కారణంగా వేలాది మంది ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లవెళ్లారు. దీంతో పాటు వేలాది మందిని సహాయక శిబిరాల్లో ఉంచారు.
*మహువా మొయిత్రాకు కొత్త బాధ్యతలు అప్పగించిన టీఎంసీ అధినేత్రి
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా అంశం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ ఆమెపై విచారణ జరిపింది. ఈ తరుణంలో మహువా మొయిత్రాకు టీఎంసీ కొత్త బాధ్యతను అప్పగించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంపి మహువా మోయిత్రాకు ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ (నాడియా నార్త్) అధ్యక్షురాలిగా మొయిత్రాను టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ నియమించారు. ఈ సందర్భంగా.. మమతా బెనర్జీకి మొయిత్రా కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “నన్ను కృష్ణానగర్ జిల్లా అధ్యక్షురాలిగా నియమించినందుకు మమతా బెనర్జీ, TMC కి ధన్యవాదాలు. కృష్ణానగర్ ప్రజల కోసం ఎప్పుడూ పార్టీతో కలిసి పనిచేస్తాను. అని మోయిత్రి తెలిపింది. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతున్న తరుణంలో టీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది.
*అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో అద్భుతం
కాసర్‌గోడ్‌లోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే. దేశంలోనే అంతులేని సంపదకు ఇది చాలా ప్రసిద్ధి. ఆలయంలోని నేలమాళిగలల్లో రాశుల కొద్ది బంగారం, వజ్రవైఢ్యూర్యాలు, స్వర్ణ విగ్రహాలు ఉన్నాయనే ఓ వార్త ప్రచారంలో ఉంది. దీనితో పాటు ఈ ఆలయానికి మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. గుడిలో సరస్సులో ఉండే బబియా మొసలి. ఈ టెంపుల్‌కి వచ్చినవాళ్లు.. దానిని సందర్శించకుండ వెళ్లరు. ఎందుకంటే ఇది శాఖహార మొసలి. భక్తులు ఇచ్చే పండ్లుఫలహారాలు తప్పు మరేవి తినదు. అందుకే గుడికి వచ్చిన భక్తులు ఈ మొసలిని చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. దాదాపు 70 ఏళ్లుగా ఈ మొసలి ఆ సరస్సులో నివస్తుందని, అది కేవలం శాఖహారం మాత్రమే తినడం విశేషం. అయితే ఎన్నో ఏళ్లుగా ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ ముసలి గతేడాది అక్టోబర్ 9, 2022న మరణించిన సంగతి తెలిసిందే. ఆలయ అధికారులు, అర్చకులు దానికి ప్రత్యేక పూజలు చేసి సంప్రదాయం ప్రకారం అంత్యసంస్కరణలు జరిపారు. అయితే ఇప్పుడు ఈ ముసలి స్థానంలో మరో ముసలి సరస్సులో దర్శనం ఇచ్చింది. అది చూసి అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మొసలి ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా వచ్చిందనేది అంతుచిక్కని విషయం. ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి సరస్సులో కనిపించడం అనివార్యంగా వస్తోంది. కానీ ఇలా ఎందుకు జరుగుతుందనేది నేటికి మిస్టరీగానే ఉంది. ఎప్పుడై ఒక మొసలి మాత్రమే ఈ సరస్సులో నివసిస్తుంది.. అదికూడా ఎవరికి హాని చేయకుండ పూజారి పెట్టే ప్రసాదం, భక్తులు ఇచ్చే ఫలాలు తింటూ శాఖహారిగా జీవించడం విచిత్రం. అంతేకాదు సరస్సులో ఉండే చేపలను అసలు ముట్టుకోదట. ఈ బబియా అనే మొసలి మూడోవది కాగా తాజాగా కనిపించింది నాలుగవ ముసలి అట. బబియా చనిపోయే ముందు దాని వయసు 70 ఏళ్లకు పైనే ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఒకప్పుడూ ఈ సరస్సులో పెద్ద మొసలి ఉండేదని దాన్ని ఆంగ్లేయులు కాల్చి చంపేయగా దాని స్థానంలఅో మరో మొసలి ప్రత్యక్షమైనట్లు ప్రజలు తెలిపారు. అది కూడా చనిపోయాక ఈ బబియా వచ్చింది. ఈ బబియా చనిపోయాక దాని అంత్యక్రియలు చూడటానికి రాజకీయ నాయకులతో సహా వేలాది మంది భక్తులు తరలిరావడం కూడా చర్చనీయాంశమయ్యింది. మళ్లీ ఆ మొసలి స్థానంలో మరో మొసలి రావడం అందర్నీ సంబ్రమాశ్చర్యాలకు గురి చేయడమే గాక భాగవత పురాణంలోని గజేంద్ర మోక్ష కథను గుర్తు చేస్తోంది. నిజానికి మొసళ్లు ఉన్నాయనేలా ఆ ఆలయం సమీపంలో నది లేదా సరస్సు కూడా లేదు. కేవలం ఆలయం కోనేరులోనే కనపించడం విచిత్రం అయితే ఎవరికి హాని తలపెట్టకుండా ఉండటం మరో విచిత్రం.