తెలుగుతేజం కోనేరు హంపి భారతదేశానికి చెందిన ప్రముఖ చెస్ క్రీడాకారిణి. కేవలం గ్రాండ్ మాస్టర్ హోదాను 15 ఏళ్ల వయసులోనే సాధించి.. అతిపిన్న వయసులోనే ఈ హోదా పొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించింది. కేవలం మహిళా గ్రాండ్ మాస్టర్లలలోనే కాదు మొత్తం గ్రాండ్ మాస్టర్లలో అతిపిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు కోనేరు హంపి.
Also Read : WOW : అదిరింది.. వన్యప్రాణుల కోసం తెలంగాణలో మొదటి ఓవర్‌పాస్ బ్రిడ్జి
2007లో ఫైడ్ ఎలో రేటింగ్ లో 2600 పాయింట్ల దాటి మహిళా చదరంగంలో జూడిత్ పొల్గర్ తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ స్థానం సాధించిన భారత దేశపు తొలి చెస్ క్రీడాకారిణి హంపి. భారత ప్రభుత్వం నుండి అర్జున అవార్డును, పద్మశ్రీ పురస్కారాలు పొందారు కోనేరు హంపి. అయితే.. తాను కూడా అందరిలాగే మూవీస్ చూస్తానని.. తనకు హీరోల్లో మహేశ్ బాబు అంటే ఇష్టమని, అంతేకాకుండా.. చెస్ టోర్నమెంట్స్ ఉన్నప్పుడు తను బ్రహ్మానందం కామిక్స్ సీన్స్ చూస్తానంటూ.. తన అభిరుచులను పంచుకున్నారు. కోనేరు హంపితో స్పెషల్ ఇంటర్వ్యూ.. క్రింద ఇచ్చిన లింక్‌లో వీక్షించవచ్చు..