Devara Movie Leaked : జూ.ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవర. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలి పార్ట్ ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి రోజే బాక్సాఫీసు వద్ద రూ.172కోట్ల కలెక్షన్లు కలెక్ట్ చేసి ఎన్టీఆర్ సత్తా ఏంటో చూపింది. ప్రస్తుతం సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే సెన్సేషన్ క్రియేటివ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత జూ.ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడం.. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మూవీ కావడంతో యావత్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సినిమా కోసం ఎదురుచూశారు. ఇక దసరాకి భారీ సినిమాలు విడుదలయ్యే అవకాశాలు లేవు. డిసెంబర్ 6న పుష్ప-2 మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో భారీగా వసూళ్లు రాబట్ట వచ్చని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో దేవర మూవీ టీంకు భారీ షాక్ తగిలింది. ఈ చిత్రం విడుదలైన కొద్ది గంటల్లోనే హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లో లీక్ అయింది.
Read Also:IND Women vs SA Women: దక్షిణాఫ్రికాను మట్టి కరిపించిన టీమిండియా!
దాదాపు మూడు గంటల రన్ టైమ్‌తో రాగా.. మూవీ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పెట్టడంతో టీమ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అసలే ఫస్ట్ డే మిక్స్ డ్ టాక్ రావడంతో.. సినిమాపై హైప్ ఎలా పెంచాలా అని ఆలోచిస్తున్న దేవర టీంకు ఇది పెద్ద దెబ్బ. దీంతో పైరసీ బారి నుంచి దేవర ఎలా బయటపడతాడన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మూవీ కథనం విషయానికి వస్తే.. ఎర్ర సముద్రం చుట్టూ ఉంటే నాలుగు గ్రామాలకు దేవర మాటే శాసనం. అక్కడ కొద్దిరోజులుగా సముద్రం నుంచి కొన్ని వస్తువులను తరలిస్తూ వచ్చే దేవర.. ఇక ఆ పని తప్పని తెలుసుకుంటాడు. తనతో ఉన్న వారిని సైతం అటువైపుగా వెళ్లవద్దని సూచిస్తాడు. కానీ, కొందరు డబ్బుకు ఆశపడి బైరా (సైఫ్ అలీఖాన్)తో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతుంటారు. సముద్రం వైపు వెళ్లే వారిని అందరిని శిక్షిస్తూ వచ్చే దేవర కొద్ది రోజులకు ఊరికి దూరంగా ఉండిపోతాడు. ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. దేవర కొడుకుగా వరం పాత్రలో కూడా ఎన్టీఆర్ కనిపిస్తాడు. తండ్రి కోసం వరం ఏం చేశాడన్నది సినిమాలో చూడాల్సిందే. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ, అలనాటి అందాల శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది.
Read Also:Pavan Kalyan : దేవర కారణంగా భారీ ధర పలుకుతున్న OG థియేట్రికల్ రైట్స్..?