IND Women vs SA Women Match IND Women won by 28 runs: మహిళల T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభానికి ముందే, భారత జట్టు తన సన్నాహాలను బలోపేతం చేసింది. ఇందులో భాగంగా జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌లను టీమిండియా గెలుచుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ లో రిచా ఘోష్, దీప్తి శర్మలు మంచి ప్రదర్శన ఇవ్వగా.. బౌలింగ్ లో ఆశా శోభన రెండు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించింది.
Virat Kohli Bat: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌కు విరాట్ కోహ్లీ బ్యాట్!
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభం సరిగా జరగలేదు. ఓపెనర్ షెఫాలీ వర్మ ఏమి పరుగులు చేయకుండానే డకౌట్ గా వెనుతిరిగింది. దీని తర్వాత, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఎక్కువసేపు నిలవలేక 10 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకుంది. ఆ తర్వాత స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్ కొన్ని మంచి షాట్లు ఆడారు. మంధాన 21 పరుగులు, రోడ్రిగ్స్ 30 పరుగులు చేశారు. చివర్లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిచా ఘోష్ 25 బంతుల్లో 36 పరుగులు, దీప్తి శర్మ 29 బంతుల్లో 35 పరుగులు చేశారు. దింతో టీమిండియా నిర్ణిత 20 ఓవర్లలో 144 పరుగులు చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్ అయాబొంగా ఖాకా నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకుంది.
Israel-Iran War: భారీ మూల్యం చెల్లించక తప్పదు.. ఇరాన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని మాస్ హెచ్చరిక!
145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు లారా వోల్వార్డ్, తాజ్మీన్ బ్రిట్స్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆఫ్రికా గెలవడానికి బలమైన పునాది వేశారు. ఈ నేపథ్యంలో తాజ్మీన్ బ్రిట్స్ 22 పరుగులు, లారా 29 పరుగులు చేసి అవుటయ్యారు. ఆశా శోభన రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్‌కు అనుకూలంగా మార్చింది. చివర్లో అన్నరీ డెర్క్‌సెన్ 21 పరుగులు, క్లో ట్రయాన్ 24 పరుగులు చేశారు. కానీ ఈ ఆటగాళ్లు ఆఫ్రికాను విజయపథంలో నడిపించలేకపోయారు. ఆఫ్రికన్ జట్టు మొత్తం 20 ఓవర్లలో 116 పరుగులకు మాత్రమే పరిమితమైంది. భారత్ తరఫున దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ ఒక్కో వికెట్ తీశారు.
India showcase their quality with a second win in the warm-up matches 💪#SAvIND: https://t.co/tUukucRXfn pic.twitter.com/GASaTbiXXQ
— ICC (@ICC) October 1, 2024