NTR Badshah: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే నందమూరి అభిమానులకు పండగే. మల్టీప్లెక్స్ నుంచి సింగల్ స్క్రీన్ వరకూ అన్ని సెంటర్స్ దగ్గర వారి అభిమానులు రచ్చ చేస్తారు. అయితే ఈసారి మాత్రం ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ఎన్టీఆర్ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. తారక రామారావు మనవడిగా ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి వచ్చి 22 ఏళ్లు అవుతున్న సందర్భంగా, ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన బాద్ షా సినిమాని రీ రిలీజ్ చేశారు. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ఎన్టీఆర్ డిఫరెంట్ స్టైల్ లో.. విభిన్న షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేశాడు. బ్రహ్మానందం, నాజర్ మధ్య డైరెక్టర్ కడుపుబ్బ నవ్వంచే కామెడీ పండించారు.
2013లో రిలీజ్ అయిన బాద్ షా మూవీని ఇప్పుడు రీ రిలీజ్ చేయడం బాగానే ఉంది. కానీ అటు డైరెక్టర్ నుంచి కానీ ఫ్యాన్స్ నుంచి కానీ బాద్ షా రీరిలీజ్ గురించి సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్టులు లేవు. దీంతో బాద్ షా సినిమా మళ్లీ విడుదల చేస్తున్నారన్న విషయం చాలా తక్కువ మందికి తెలిసింది. ఏదేమైనప్పటికీ తమ అభిమాన హీరోను వెండితెరపై చూడాలని అనుకున్న వారు బాద్షా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాద్ షా హాష్ ట్యాగ్(#Baadshah)ని క్రియేట్ చేసి ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం, బాద్ షా స్థానంలో సింహాద్రి, ఊసరవెల్లి లాంటి సినిమాలను రీ రిలీజ్ చేసి ఉంటే బాగుండేది అంటున్నారు.
Read Also: God Father: ‘గాడ్ ఫాదర్’ కి గ్రాండ్ వెల్కమ్ చెప్తారా?
ఏది ఏమైనా హీరోల బర్త్ డేకి సినిమాలు స్పెషల్ షోస్ వేసే దగ్గర నుంచి పెద్ద అకేషన్ ఏమీ లేకుండానే పాత సినిమాలని రీరిలీజ్ చేయడం వరకూ ఇప్పటి ట్రెండ్ స్ప్రెడ్ అయ్యింది. ఇంతకు ముందు మహేష్ బాబు పోకిరి, పవన్ కళ్యాణ్ జల్సా, ప్రభాస్ బిల్లా, బాలయ్య నటించిన చెన్నకేశవ రెడ్డి సినిమాలు స్పెషల్ షోస్ రూపంలో ఫ్యాన్స్ లో జోష్ నింపాయి. ఈ సినిమాల స్పెషల్ షోస్ మంచి కలెక్షన్స్ ని కూడా రాబట్టాయి. మరి ఇప్పుడు స్పెషల్ షోస్ కాకుండా ఏకంగా రీరిలీజ్ అయిన బాద్ షా సినిమా ఎంత రాబడుతుంది అనేది చూడాలి.