గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యాడు.. అదే జోష్ తో ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం లో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు.. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ గోవాకు వెళ్లాడు.. ఆ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
దేవర సినిమాలోని కీలక సన్నీవేశాలను, జాన్వీ – ఎన్టీఆర్ ల పై ఒక అద్భుతమైన సాంగ్ ను అక్కడ చిత్రీకరించబోతున్నారట.. అందుకోసమే ఎన్టీఆర్ గోవాకు బయలుదేరారు.. తన ఫిట్నెస్ ట్రైనర్ తో కలిసి ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.. ఆయన లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. టీ షర్ట్, జీన్స్ ధరించి ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు.. ఆ ఫోటోలలో ఎన్టీఆర్ బరువు తగ్గినట్లు కనిపిస్తున్నారు.. ఆ ఫోటోలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు…
దేవర సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించునున్నారు. రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నారు. దేవర చిత్రంలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్-జాన్వీ కాంబినేషన్ పై హైప్ నెలకొంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి అనుకున్న టైం లో విడుదల చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమాతో ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్నారు.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యనున్నారు..