Site icon NTV Telugu

Jr NTR : ఫ్యాన్స్ కు డబుల్ ట్రేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న ‘ఎన్టీఆర్’

Dragan

Dragan

వార్ 2 తో కాస్త డీలా పడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా  డ్రాగన్ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ఒక పవర్ ఫుల్ గ్లింప్స్‌ను మే 19న ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో తారక్ లుక్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం జూన్ 25, 2026న విడుదల కానుంది.

Also Read : Venky – Anil 4 : వెంకీ మామ.. అనిల్ రావిపూడి.. షూటింగ్ ఎప్పుడంటే

ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న సినిమా గాడ్ ఆఫ్ వార్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మే 19నే రాబోతోందని టాక్. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘అరవింద సమేత’ సృష్టించిన ప్రభంజనం మనకు తెలిసిందే. ఇప్పుడు రాబోయే చిత్రం ఒక భారీ మైథలాజికల్ టచ్ ఉన్న సోషియో ఫాంటసీ కథగా ‘గాడ్ ఆఫ్ వార్ రాబడుతోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో, ఒకరోజు ముందే ఈ డబుల్ ధమాకా ఇవ్వడం ద్వారా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వడానికి  నిర్మాతలు  ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలే కాకుండా  దేవర 2 కి సంబంధించిన అప్‌డేట్స్ కూడా అదే సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ బర్త్ డే ఎంతో స్పెషల్ గా ఉండబోతుంది.

Exit mobile version