NTR : దేవర సినిమాతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా.. డివైడ్ టాక్‌తోనే ఏకంగా 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. మేకర్స్‌కి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. నిన్న మొన్నటి వరకు దేవర సక్సెస్‌ని ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు యుద్ధభూమికి బయల్దేరాడు. చెప్పినట్టే.. నవంబర్ థర్డ్ వీక్‌లో వార్ 2 షూటింగ్ కోసం ముంబై ఫ్లైట్ ఎక్కేశాడు టైగర్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడనే టాక్ ఉంది.
Read Also:IND vs PAK: నేడు భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్ తెలుగబ్బాయే! ఫుల్ డీటెయిల్స్ ఇవే
This time 1500 Cr 💥🔥#War2 pic.twitter.com/Esr9jK3Cmv
— H A N U (@HanuNews) October 19, 2024
ఇండియాస్ మోస్ట్ అవైటేడ్ మల్టీస్టారర్ మూవీ కావడంతో.. వార్ 2 పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఇప్పటికే కొన్ని కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు వార్ 2 నెక్స్ట్ షెడ్యూల్ కోసం ముంబైకి వెళ్లాడు. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, హృతిక్ పై భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఓ మాస్ సాంగ్ కూడా షూట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. వీలైనంత త్వరగా వార్ 2 షూటింగ్ ఫినిష్ చేసి.. వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. నవంబర్‌లో ఎన్టీఆర్-నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. డిసెంబర్‌లో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు. ఈలోపు వార్ 2కి సంబంధించిన వర్క్ మొత్తం కంప్లీట్ చేయనున్నాడు టైగర్. 2025 ఆగష్టులో వార్ 2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Read Also:CM Chandrababu: చరిత్ర తిరిగి రాయడానికి సిద్ధమయ్యం.. జెట్ స్పీడ్‌తో పనులు..