NTR : కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. అయితే.. తాజాగా కర్ణాటక సీఎం ప్రత్యేక ఆహ్వానం మేరకు అసెంబ్లీకి జూనియర్ ఎన్టీఆర్ అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. దీంతో తారక్ కర్ణాటక ప్రయాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.. తెలుగులో అగ్రతారల్లో ఒకరిగా కొనసాగుతూ అశేష అభిమానుల మనసులను గెలుచుకున్నారు ఎన్టీఆర్. తారక్.. కన్నడలోనూ జనాదరణ పొందారు. తాజాగా కర్ణాటక విధాన సౌధలో జరగబోయే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నవంబర్ 1న జరగబోయే కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమానికి తారక్ వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక అత్యున్నత పురస్కారం ‘కర్ణాటక రత్న’ అవార్డు ఇవ్వనున్నారు.
Also Read :RGV : టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై ఆర్జీవీ వ్యంగ్యాస్త్రాలు
ఈ కార్యక్రమానికి రావడానికి తారక్ సుముఖత వ్యక్తం చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు. అలాగే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సైతం ఆహ్వానించామని చెప్పారు. కన్నడ ప్రజల్లో పునీత్‌కు ఉన్న గౌరవానికి ఈ అవార్డు ప్రదానం చేస్తున్నామని బొమ్మై తెలిపారు. ఈ కార్యక్రమానికి పునీత్ రాజ్ కుమార్ కుంటుంబంతోపాటు జ్ఞనపీఠ్ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్ను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు, కవులు, కళాకారులు, రచయితలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పునీత్ రాజ్‌కుమార్ గత ఏడాది అక్టోబర్ 23న కన్నుమూశారు. ఈ అవార్డు అందుకున్న 9వ వ్యక్తిగా పునీత్ నిలవనున్నారు.
Also Read
- PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- Amit Shah-Om Birla: లోక్‌సభ స్పీకర్‌కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
- Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మృతి.? పాక్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
-
Explainer: తమిళ మీడియం కుర్రాడు.. టాటా గ్రూప్‌ను ఎలా నడిపించారు?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..