NTV Telugu Site icon

NTR : కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్‌

Ntr Karnataka Assembly

Ntr Karnataka Assembly

తన నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. అయితే.. తాజాగా కర్ణాటక సీఎం ప్రత్యేక ఆహ్వానం మేరకు అసెంబ్లీకి జూనియర్ ఎన్టీఆర్ అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. దీంతో తారక్​ కర్ణాటక ప్రయాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.. తెలుగులో అగ్రతారల్లో ఒకరిగా కొనసాగుతూ అశేష అభిమానుల మనసులను గెలుచుకున్నారు ఎన్టీఆర్‌. తారక్​.. కన్నడలోనూ జనాదరణ పొందారు. తాజాగా కర్ణాటక విధాన సౌధలో జరగబోయే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నవంబర్ 1న జరగబోయే కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమానికి తారక్​ వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో దివంగత నటుడు పునీత్​ రాజ్​కుమార్​కు కర్ణాటక అత్యున్నత పురస్కారం ‘కర్ణాటక రత్న’ అవార్డు ఇవ్వనున్నారు.
Also Read :RGV : టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై ఆర్జీవీ వ్యంగ్యాస్త్రాలు

ఈ కార్యక్రమానికి రావడానికి తారక్​ సుముఖత వ్యక్తం చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు. అలాగే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్​ను సైతం ఆహ్వానించామని చెప్పారు. కన్నడ ప్రజల్లో పునీత్​కు ఉన్న గౌరవానికి ఈ అవార్డు ప్రదానం చేస్తున్నామని బొమ్మై తెలిపారు. ఈ కార్యక్రమానికి పునీత్ రాజ్​ కుమార్ కుంటుంబంతోపాటు జ్ఞనపీఠ్​ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్​ను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు, కవులు, కళాకారులు, రచయితలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పునీత్​ రాజ్​కుమార్ గత ఏడాది అక్టోబర్ 23న కన్నుమూశారు. ఈ అవార్డు అందుకున్న 9వ వ్యక్తిగా పునీత్ నిలవనున్నారు.