గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలో కూడా రియల్ హీరో అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అందుకు కారణాలు లేక పోలేదు.. తన దగ్గరకు సాయం కోసం వచ్చిన వారికి సాయం చేస్తాడు.. తాజాగా ఎన్టీఆర్ ఓ గుడికి భారీగా విరాళం ఇచ్చాడు. ఆంద్రాలోని ఓ ఆలయానికి లక్షల విరాళం ఇచ్చినట్లు ఓ వార్త వినిపిస్తుంది.. అందుకు సంబందించిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఆంధ్రాలో తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చారని సమాచారం. జగ్గన్నపేట భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ 12 లక్షల 50 వేల రూపాయలు విరాళం ఇచ్చారు. గుడి బయట దాతల పేర్లను రాళ్లపై పేర్లు రాయించగా అందులో ఎన్టీఆర్ ఫ్యామిలీ పేర్లు ఉన్నాయి.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఏకంగా 12 లక్షల 50 వేలు ఓ ఆలయ నిర్మాణానికి విరాళం ఇవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్నారు. దేవర, వార్ 2 సినిమాల లో నటిస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉండటంతో ఆ రోజు దేవర, వార్ 2 సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయని భావిస్తున్నారు.. ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే..