నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అంటే మూడు అక్షరాలు కాదని, తెలుగువారి ఆత్మగౌరవం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుజాతి చరిత్ర ఉన్నంతవరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రయత్నించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. రాజకీయాలను ఎన్టీఆర్ సమూలంగా మార్చారన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి.. గొప్ప కథానాయకుడిగా, గొప్ప నాయకుడుగా ఎదిగారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు కడప జిల్లా మైదుకూరులో సీఎం జరుపుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహంకి పూలమాల వేసి నివాళి అర్పించారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు మైదుకూరులో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలుగువారి గుండెల్లో ఉన్న వ్యక్తి ఎన్టీఆర్. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రయత్నించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే తెలుగువారి ఆత్మ గౌరవం. బడుగు బలహీన వర్గాల వారికి ఆయన అంటే ధైర్యం. గతంలో తెలుగు వారికి గౌరవం ఉండేది కాదు. మనందరినీ మద్రాసి అని పిలిచేవారు. ఢిల్లీని గడగడలాడించి తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్’ అని అన్నారు.
Also Read: Top Headlines @1PM : టాప్ న్యూస్!
‘ఆరోజు ఎన్టీఆర్ ప్రారంభించిన రెండు రూపాయల కిలో బియ్యం.. ఈరోజు దేశవ్యాప్తంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్టుగా అవతరించింది. చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని కోరుకున్న వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఒక ఆదర్శం, ఒక స్ఫూర్తి. రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి సినిమాలలో ఓ గొప్ప వ్యక్తి గా ఎదిగారు. గతంలో దోపిడీకి కేంద్రంగా ఉన్న రాజకీయాలను సమూలంగా మార్చి చూపించారు. బీసీలకు మొదటిసారిగా రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆడబిడ్డకు ఆస్తి హక్కు ఎన్టీఆర్ వల్లే సాధ్యం అయింది. మహిళ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు.పేదరికం నిర్ములన ఎన్టీఆర్ కల.. ఇదే టీడీపీ పార్టీ ద్వేయం. రాయలసీమ కరువు సీమ కాదు.. రతనాల సీమ అని ఎన్టీఆర్ చేసి చూపించారు’ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.