ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్‌లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహంకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురధేశ్వరి ఘన నివాళి అర్పించారు. మరణం లేని జననం ఎన్టీఆర్ జననం అని, జన్మ జన్మకి ఆయనకే కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నాను అని పురధేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ గారు ఏ రంగంలో ఉన్నా.. ఆ రంగానికి ఆయన వన్నె తెచ్చారన్నారు. నేడు ఎన్టీఆర్ 29వ వర్ధంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నివాళులు అర్పిస్తున్నారు.
దగ్గుబాటి పురధేశ్వరి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… ‘మరణం లేని జననం ఎన్టీఆర్ జననం. జన్మ జన్మకి ఆయనకే కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ గారు ఏ రంగంలో ఉన్నా.. ఆ రంగానికి ఆయన వన్నె తెచ్చారు. చలన చిత్రంలో కేవలం రంగులు వేసే వారీగా మాత్రమే గుర్తింపు వుండేది. ఎన్టీఆర్ గారు సినీ రంగంలోకి అడుగుపెట్టిన తరువాత సినీ చరిత్రకి కొత్త గుర్తింపు తెచ్చారు. రాజకీయాల్లో కూడా తన కంటూ కొత్త చరిత్ర రాశారు. మహిళల కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. పేదల కోసం రెండు రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మాండలిక వ్యవస్థను తీసుకువచ్చారు. ఎన్టీఆర్ గారు ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు, ఆంధ్రుల ఆత్మ గౌరవం తీసుకువచ్చారు’ అని అన్నారు.
Also Read: Nara Lokesh: త్వరలోనే తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేస్తాం!
ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా విజయవాడ ఎన్టీఆర్ భవన్‌లో ఎంపీ కేశినేని చిన్ని నివాళులు అర్పించారు. ‘పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్. నారా లోకేష్ ఆధ్వర్యంలో కోటి సభ్యత్వంతో రికార్డు సృష్టించాం. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ కి కృషి చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్యాకేజీ ప్రకటించడం ఆనందకరం’ అని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.