కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. మరో సంస్థలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తాజాగా నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ indiaseeds.com సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం ఖాళీలు : 89
ట్రైనీ (వ్యవసాయం) -40,
జూనియర్ ఆఫీసర్ I (విజిలెన్స్) 15 పోస్టులు,
ట్రైనీ (అగ్రికల్చర్ స్టోర్) 12 పోస్టులు,
ట్రైనీ (మార్కెటింగ్) 06 పోస్టులు,
ట్రైనీ (స్టెనోగ్రాఫర్) 05 పోస్టులు ఖాళీలు ఉన్నాయి..
అలాగే..
జూనియర్ ఆఫీసర్ I (లీగల్) 04 పోస్టులు,
ట్రైనీ (క్వాలిటీ కంట్రోల్) 03 పోస్టులు,
జూనియర్ ఆఫీసర్ I (విజిలెన్స్) 02 పోస్టులు, మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) 01 పోస్ట్, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) 01 పోస్ట్, మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్ ఇంజనీరింగ్) 01 ఉన్నాయి..
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే వారు తప్పనిసరిగా 10th/12th/ITI/BE/B. Tech/Diploma గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణులై ఉండాలి..
వయస్సు :
జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకు వయస్సు 30 ఏళ్లు మించకూడదు. మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు 27 ఏళ్లకు మించకూడదు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఆగస్టు 28, 2023 కాగా.. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 25, 2023 వరకు ఉంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) తేదీ అక్టోబర్ 10, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు www.indiaseeds.com వెబ్ సైట్ లో చూడవచ్చు..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.indiaseeds.com కి వెళ్లండి .
ఆ తర్వాత అభ్యర్థి హోమ్‌పేజీలో కెరీర్‌ల ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత అభ్యర్థి అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి..
ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
ఆ తర్వాత అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి..