NTV Telugu Site icon

Agniveer: ఆర్మీలో చేరడం మీ లక్ష్యమా?.. 10th పాసైతే చాలు.. అగ్నివీర్ పోస్టులకు అప్లై చేసుకోండి

Agniveer

Agniveer

ఇండియన్ ఆర్మీలో చేరాలని యూత్ కలలుకంటుంటారు. ఆర్మీ రిలీజ్ చేసే జాబ్ నోటిఫికేషన్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD), టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్, సైనిక్ ఫార్మా, సైనిక్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, మహిళా పోలీస్ పోస్టులను భర్తీ చేస్తారు. దీనితో పాటు, హవల్దార్ ఎడ్యుకేషన్, హవల్దార్ సర్వేయర్ ఆటోమేటెడ్ కార్టోగ్రాఫర్, జెసిఓ క్యాటరింగ్, జెసిఓ రిలిజియస్ టీచర్ పోస్టులు భర్తీకానున్నాయి.

Also Read:Raja Saab: ‘ది రాజాసాబ్‌’ నెక్స్ట్ లెవల్.. టీజర్ లోడింగ్?

అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 45% మార్కులతో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు ఉండాలి. హెవీ, తేలికపాటి వాహనాలు నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులకు డ్రైవర్ నియామకంలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. టెక్నికల్ పోస్టులకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 50% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు తప్పనిసరి.

Also Read:Retro : ‘రెట్రో’ మూవీ నుంచి పూజా హెగ్డే అప్ డేట్..

క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్ రిక్రూట్‌మెంట్ కోసం, అభ్యర్థి 60% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో 50% మార్కులు కలిగి ఉండటం తప్పనిసరి. అభ్యర్థి 2004 అక్టోబర్ 1- 2008 ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్షతో పాటు శారీరక సామర్థ్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అగ్నివీర్ పోస్టులకు జనరల్, SC, ST, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు కేవలం రూ. 250 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్ లైన్ విధానంలో దరాఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.