NTV Telugu Site icon

Rishi Sunak: రువాండా బిల్లుకు బ్రిటన్ ఆమోదం.. ఐరాస ఆందోళన

Seke

Seke

బ్రిటన్‌లో రిషి సునాక్‌ ప్రభుత్వం సరికొత్త బిల్లును ఆమోదించింది. ఈ బిల్లుతో అక్రమ వలసలకు అట్టుకట్ట వేసినట్టైంది. వివాదాస్పద రువాండా బిల్లుకు బ్రిటన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీనిని సమర్థించుకున్న ప్రధానమంత్రి రిషి సునాక్‌ అక్రమ వలసదారులను ఆఫ్రికా దేశానికి తరలించేందుకు ఏదీ అడ్డు కాదన్నారు. అంతర్జాతీయ వలసల నిర్వహణలో ఇదో మైలురాయని తెలిపారు. బ్రిటన్‌ రాజు ఆమోదం తర్వాత ఇది చట్టరూపం దాల్చనుంది.

ఇది కూడా చదవండి: Pawan kalyan: జై భీమ్ స్ఫూర్తి తో రాజకీయాల్లోకి వచ్చా

బ్రిటన్‌కు వచ్చే అక్రమ వలసదారులను నిరోధించేందుకు ఈ రువాండా బిల్లును ప్రవేశపెట్టినట్లు రిషి సునాక్ తెలిపారు. దీంతో వలసదారులను దోపిడీకి గురిచేసే క్రిమినల్‌ గ్యాంగ్‌ల కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. ఇకనుంచి దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారు ఇక్కడ ఉండేందుకు తాజా చట్టం అంగీకరించదని.. ఇక మా దృష్టంతా వారిని విమానాల్లో తరలించడం పైనే ఉంటున్నారు.

ఇది కూడా చదవండి: Prashanth Varma : జై హనుమాన్ లో మరిన్ని సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ చూస్తారు..

బ్రిటన్‌లోకి అక్రమ వలసలు పెరుగుతున్నట్లు ప్రభుత్వ నివేదికల్లో తేలాయి. 2022లోనే 45 వేల మంది వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే భద్రతా రువాండా బిల్లును బ్రిటన్‌ రూపొందించింది. వలసదారుల్ని తరలించేందుకు ఆఫ్రికా దేశం సురక్షితంగా పేర్కొంటూ బిల్లుకు ఆమోదం తెలిపింది. తద్వారా అక్రమంగా వచ్చేవారిని 6,400 కి.మీ. దూరంలో రువాండాకు తరలిస్తారు. రాజధాని కిగాలిలో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో ఉంచుతారు. ఇందుకోసం ఏప్రిల్‌ 2022లోనే బ్రిటన్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వలసదారులకు మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు ఆ దేశానికి ఇప్పటివరకు 290 మిలియన్ల పౌండ్లను చెల్లించింది. త్వరలో మరో 50 మిలియన్‌ పౌండ్లను చెల్లించనున్నట్లు సమాచారం. అక్కడే బ్రిటన్‌లో ఆశ్రయం కోరుకునే వారి దరఖాస్తులను పరిశీలిస్తారు.

ఇదిలా ఉంటే అక్రమ వలసదారులను ఆఫ్రికా తరలించే అంశంపై బ్రిటన్‌ విపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఆశ్రయం కోరుకునేవారిని రువాండా తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను బ్రిటన్‌ పునఃపరిశీలించాలని సూచించింది. ఇలా చేయడం చట్టవిరుద్ధమని ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: Elections : డిపాజిట్ గల్లంతైనా ఎమ్మెల్యే అయ్యారు… ఎలాగంటే..