Site icon NTV Telugu

Nothing Phone (4a) సిరీస్ స్పెక్స్, ధర, రంగులు లీక్.. లాంచ్ ఎప్పుడంటే..?

Nothing Phone (4a)

Nothing Phone (4a)

Nothing Phone (4a): నథింగ్ (Nothing) సంస్థ ఇటీవల Phone (3a) కమ్యూనిటీ ఎడిషన్ ను ప్రత్యేకమైన డిజైన్‌తో మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే కంపెనీ ఇప్పుడు దాని తరువాతి తరం సిరీస్‌పై పనిచేస్తుంది. ఇందుకు సంబంధించి కొత్త లీక్ ద్వారా Nothing Phone (4a), Nothing Phone (4a) Pro లతోపాటు కొత్త బడ్జెట్ హెడ్‌ఫోన్లకు సంబంధించిన కీలక వివరాలు బయటపడ్డాయి. ఈ తాజా లీక్ ప్రకారం.. Nothing తన మిడ్ రేంజ్ సెగ్మెంట్ కోసం తాజా Qualcomm చిప్‌సెట్లను ఉపయోగించే అవకాశాలున్నాయని సమాచారం. Nothing Phone (4a) స్మార్ట్ ఫోన్ లో Snapdragon 7s సిరీస్ ప్రాసెసర్, Nothing Phone (4a) Pro లో మరింత శక్తివంతమైన Snapdragon 7 సిరీస్ చిప్‌సెట్ వినియోగచబోతున్నట్లు తెలుస్తోంది.

Local Body Elections : ముగిసిన రెండో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం

Phone (3a), Phone (3a Pro) మోడళ్లలో Snapdragon 7s Gen 3 ఉపయోగించారు. అందువల్ల కొత్త మోడళ్లలో Snapdragon 7s Gen 4 అండ్ Snapdragon 7 Gen 4 కనిపించే అవకాశం ఉంది. లీక్ ప్రకారం, eSIM సపోర్ట్‌ను కేవలం Pro మోడల్‌కే అందించనున్నట్లు తెలుస్తోంది. రాబోయే Nothing Phone (4a) సిరీస్ పింక్, వైట్, బ్లాక్, బ్లూ అనే నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుందని లీకులు చెబుతున్నాయి. నిజానికి Nothing మినిమలిస్టిక్ డిజైన్‌కు ప్రసిద్ధి చెందినప్పటికీ, ఈసారి మరింత ప్రకాశవంతమైన రంగులను తీసుకురావడం ఆసక్తికరం. రాబోయే ఈ ఫోన్స్ 12GB + 256GB వేరియంట్ కోసం Phone (4a) సుమారు 475 అమెరికా డాలర్లు, Phone (4a) Pro సుమారు 540 అమెరికా డాలర్లుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Supreme Court: ‘‘అందర్ని చంద్రుడిపైకి పంపాలా.?’’ భూకంపాల పిటిషన్‌పై సుప్రీంకోర్ట్..

Nothing Phone (4a) సిరీస్‌కు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదుగానీ.. లీక్ అయిన స్పెక్స్, ధరలు చూస్తే ఈ మోడళ్లు మిడ్ రేంజ్ మార్కెట్లో మంచి పోటీని సృష్టించే అవకాశం ఉంది. Nothing ఫోన్ ప్రత్యేక డిజైన్, కొత్త చిప్‌సెట్లు, బడ్జెట్ హెడ్‌ఫోన్లు అన్నీ కలిపి కంపెనీ పెద్ద లాంచ్‌కు ప్లాన్ చేస్తుంది.

Exit mobile version