Nothing Phone 2a Smartphone Launch and Price in India: లండన్‌కు చెందిన కన్స్యూమర్ టెక్ కంపెనీ ‘నథింగ్’ రెండు సంవత్సరాలలోనే మొబైల్ మార్కెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్‌లకు మంచి స్పందన వచ్చింది. నథింగ్ ఫోన్ 2కు కొనసాగింపుగా ‘నథింగ్ ఫోన్ 2ఏ’ను విడుదల చేయడానికి సిద్దమైంది. మార్చి 5న గ్లోబల్ మార్కెట్‌తో సహా భారత్‌లో కూడా ఈ ఫోన్ లాంచ్ కానుంది. నథింగ్ ఫోన్ 2ఏ ధర రూ.30 వేల నుంచి ప్రారంభం కావచ్చునని సమాచారం.
Nothing Phone 2a Price:
నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్‌ఫోన్ ధర.. నథింగ్ ఫోన్ 1 కంటే తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నథింగ్ ఫోన్ 2ఏ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 8GB+128GB వేరియంట్ ధర దాదాపు €349 (భారత కరెన్సీలో సుమారు 30,000), 12GB+256GB వేరియంట్ ధర €399 (సుమారు 35,000)గా ఉండే అవకాశం ఉంది.
Nothing Phone 2a Specs:
నథింగ్ ఫోన్ 2ఏలో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేని కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో పంచ్ హోల్ కటౌట్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్‌సెట్‌తో వస్తున్న ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ ఆధారంగా పని చేస్తుంది.
Also Read: Samsung Galaxy A34 5G Price: శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్‌పై భారీ తగ్గింపు!
Nothing Phone 2a Camera and Battery:
నథింగ్ ఫోన్ 2ఏ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 50 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండగా.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4,800 ఎంఏహెచ్ బ్యాటరీతో ఏ ఫోన్ రానుంది.