NTV Telugu Site icon

NOTA : నోటాపై రాజకీయ పార్టీల మిశ్రమ స్పందన

Nota

Nota

NOTA : స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా ను కల్పిత అభ్యర్థిగా పెట్టాలా వద్ద అనే అంశం రాజకీయ పార్టీల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అయింది… కాంగ్రెస్ పార్టీ ఈ పద్ధతిని వ్యతిరేకించగా BRS పార్టీ స్వాగతించింది… బీజేపీ మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం కి ఆ అధికారం లేదని.. రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పింది…సిపిఎం నోటా ఉండాలని… కానీ అభ్యర్థిగా గుర్తించోద్దని స్పష్టం చేసింది… గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ లతో రాష్ర్ట ఎన్నికల సంఘం భేటీ అయింది… ట్రయల్ ప్రాతిపదికన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటా ను కూడా ఒక కల్పిత అభ్యర్థిగా పెట్టాల వద్దా అనే అంశం రాజకీయ పార్టీ ల అభిప్రాయం తీసుకుంది…. రాజకీయ పార్టీ ల ముందు రాష్ర్ట ఎన్నికల కమిషన్ ప్రతిపాదనలు పెట్టింది…

ఎన్నికల ఫలితాలను ప్రకటించేటప్పుడు నోటాను ‘కల్పిత ఎన్నికల అభ్యర్థి’గా పరిగణించడం… పోటీ చేస్తున్న అభ్యర్థి , “కల్పిత ఎన్నికల అభ్యర్థి” అంటే నోటా అత్యధిక సంఖ్యలో సమాన ఓట్లను పొందినట్లయితే, పోటీ చేస్తున్న అభ్యర్థి (నోటా కాదు) ఎన్నికైనట్లు ప్రకటించడం…. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ వ్యక్తిగతంగా ‘కల్పిత ఎన్నికల అభ్యర్థి’ అంటే నోటా కంటే తక్కువ ఓట్లు పొందినట్లయితే, పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఎవరూ ఎన్నికైనట్లు ప్రకటించబడరు…ఎవరు ఎన్నిక కానట్లు అయితే, ఆ స్థానానికి తిరిగి ఎన్నిక నిర్వహించబడుతుంది. నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తిరిగి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు… తిరిగి ఎన్నికలో, నోటాకు మళ్లీ అత్యధిక ఓట్లు వస్తే, తదుపరి ఎన్నికలు నిర్వహించబడవు, అత్యధిక ఓట్లు (నోటా మినహా) ఉన్న పోటీ చేస్తున్న అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించబడుతుంది…

ఈ ప్రతిపాదనలు పై రాజకీయ పార్టీ లు భిన్న అభిప్రాయాలను వెలిబుచ్చాయి… కాంగ్రెస్ పార్టీ కల్పిత అభ్యర్థిగా పరిగణించడాన్ని వ్యతిరేకించింది… నోటా ఎక్కువ ఓట్లు వచ్చి ఎన్నికలు మళ్ళీ నిర్వహించాలని అంటే అటు ప్రభుత్వానికి, ఇటు అభ్యర్థులకు ఖర్చు పెరుగుతుందని ఆ పార్టీ నేతలు అన్నారు…

నోటాను కల్పిత అభ్యర్థిగా పరిగణించడం నీ BRS స్వాగతించింది… ఏకగ్రీవానికి బెదిరింపులు, బలప్రదర్శన చేసే అవకాశం ఉందనీ ఆ పార్టీ పేర్కొంది… సుప్రీంకోర్టు లో కేసు ఉందని మా అభిప్రాయం ఇప్పుడే చెప్పలేమని బీజేపీ అంది… స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదనీ… పంచాయతీ ఎన్నికలు ఎలా నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం అని స్పష్టం చేసింది…

నోటా తో ఎన్నిక ఉండాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పింది…. నోట ఉండాలని అయితే అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తె రీ ఎలక్షన్ కరెక్ట్ కాదనీ సిపిఎం చెప్పింది….తమ అభిప్రాయాన్ని రెండు రోజుల్లో చెప్తామని టిటీడీపీ చెప్పగా… సింగల్ కాండిడేట్ ఉన్నా నోటా ఉండాలన్న జనసేన పార్టీ.. చెప్పింది

రాష్ట్రంలో సర్పంచ్ పదవుల వేలం (పార్టీ రహితంగా జరిగేటప్పుడు) ను అరికట్టడానికి కల్పిత అభ్యర్థి నిర్ణయం అని రాష్ర్ట ఎన్నికల సంఘం అంటుంది… ఇప్పటికే మహారాష్ర్ట, హర్యానా రాష్ట్రాలు కల్పిత అభ్యర్థి విధానం ను అవలంభిస్తున్నాయని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీ ల ముందు పెట్టింది…

Prudhvi Raj: వైసీపీ అభిమానులపై ల’కారాలతో రెచ్చిపోయిన పృథ్వి రాజ్