NTV Telugu Site icon

Atul Subhash Case: భార్యల వేధింపులు.. వరకట్నం చట్టం సెక్షన్ 498ఏ రివ్యూపై సుప్రీంకోర్టులో పిల్..

Atul Subhash Case

Atul Subhash Case

Atul Subhash Case: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తప్పుడు వరకట్న వేధింపులు, గృహ హింస చట్టాలు సెక్షన్ 498-ఏ ని సమీక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు భర్త, అతడి ఫ్యామిలీని వేధించేందుకు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెబుతున్నారు. అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈ డిమాండ్ వస్తోంది. ఆయనకు న్యాయం చేయాలని, ఆయన భార్య నిఖితా సింఘానియాని అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఈ కేసు నేపత్యంలో తప్పుడు వరకట్నం, గృహ హింస చట్టాలపై సమీక్ష కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం (పిల్) దాఖలలైంది. చట్టాలను సమీక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, లాయర్లు, లీగర్ జూరిస్టులతో కమిటీ ఏర్పాటు చేయాలని లాయర్ విశాల్ తివారీ కోరారు.

Read Also: Bengaluru Techie Suicide Case: 3 రోజుల్లో రావాలి.. అతుల్ సుభాష్ భార్యకి పోలీస్ సమన్లు..

“వరకట్న నిషేధ చట్టం మరియు IPC యొక్క సెక్షన్ 498A వరకట్న డిమాండ్లు మరియు వేధింపుల నుండి వివాహిత స్త్రీలను రక్షించడానికి ఉద్దేశించబడింది, అయితే మన దేశంలో ఈ చట్టాలు అనవసరమైన, చట్టవిరుద్ధమైన డిమాండ్లను పరిష్కరించడానికి భర్త, అతడి కుటుంబాన్ని అణిచివేసేందుకు ఆయుధాలుగా మారాయి.” అని పిటిషన్‌లో పేర్కొన్నారు. తప్పుడు వరకట్న కేసుల్లో పురుషుల్ని ఇరికించడం విషాదకరమైన ముగింపులకు దారి తీసిందని పిల్‌లో పేర్కొన్నారు.

ఈ చట్టాల ప్రకారం వివాహిత పురుషులపై ఈ తప్పుడు కేసుల కారణంగా, మహిళలపై జరుగుతున్న నిజమైన అణిచివేతను అనుమానాస్పదంగా చూడాల్సి వస్తోందని, ఇది ఒక్క అతుల్ సుభాష్ కేసు గురించి మాత్రమే కాదని, అనేక మంది భార్యలు వరకట్న చట్టాలను దుర్వినియోగం చేయడం వల్ల చాలా మంది బాధితులుగా ఉన్నారని, చట్టం ఉద్దేశం దెబ్బతింటుందని విశాల్ తివారీ పిటిషన్‌లో పేర్కొన్నారు.