రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. నార్తర్న్ రైల్వే 4,116 ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ITI సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. అభ్యర్థులు 15 సంవత్సరాల కంటే తక్కువ, 24 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండకూడదు. రైల్వే నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
Also Read:Deepti Chaurasia: ఢిల్లీలో ప్రముఖ వ్యాపారి కోడలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే..!
వయస్సును డిసెంబర్ 24, 2025 నాటికి లెక్కిస్తారు. ఈ నియామకంలో, అభ్యర్థులను విద్యార్హత ఆధారంగా ఎంపిక చేస్తారు, అంటే, వారు ఎలాంటి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. జనరల్, OBC, EWS కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ నింపి రూ. 100 ఫీజు చెల్లించాలి. SC, ST, మహిళా అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో డిసెంబర్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.