North Korea: రాత్రిపూట పరేడ్‌లో ఉత్తర కొరియా పెద్ద సంఖ్యలో అణు క్షిపణులను ప్రదర్శించిందని ఆ దేశ మీడియా నివేదించింది. గతంలో కంటే ఎక్కువ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు (ICBMs), కొత్త ఘన-ఇంధన ఆయుధాన్ని ప్రదర్శించినట్లు తెలిసింది. ఉత్తర కొరియా తన సైన్యం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ప్యోంగ్యాంగ్లో రాత్రిపూట సైనిక కవాతును నిర్వహించిందని తెలిసింది. ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి హాజరయ్యారు. సైనిక వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా బుధవారం ఆయన సైనికాధికారులను కలిసినప్పు తన కుమార్తె కిమ్-జు-యే కూడా ఉన్నారు. కూతురితో కలిసి కిమ్ కనిపించడం ఇది నాలుగో సారి. ఇలా పదే పదే కుమార్తెతో ప్రత్యక్షమవ్వడం వెనుక భవిష్యత్తులో పగ్గాలు తన వారసులకే దక్కుతాయన్న సంకేతాలను కిమ్ పంపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కిమ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వంశపారంపర్య నియంతృత్వంలో భవిష్యత్ నాయకత్వ పాత్రను పోషిస్తున్నట్లు భావించారు.
WHO Chief: బ్రేవ్ గర్ల్.. తమ్ముడికి రక్షణ కవచంలా.. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ప్రశంసలు
ఈ పరేడ్‌లో వ్యూహాత్మక అణు యూనిట్లు కూడా ఉన్నాయని ఉత్తర కొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ పేర్కొంది.మీడియా విడుదల చేసిన చిత్రాల్లో ఉత్తర కొరియాకు చెందిన అతిపెద్ద బాలిస్టిక్ క్షిపణులైన హ్వాసాంగ్-17లు 11 ఉన్నాయని.. ఇవి అణు వార్‌హెడ్‌తో ప్రపంచంలో ఎక్కడైనా దాడి చేయగల పరిధిని కలిగి ఉన్నాయని అనుమానిస్తున్నారు. హ్వాసాంగ్-17ను గతేడాది తొలిసారిగా పరీక్షించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు, ఆంక్షలు ఉన్నప్పటికీ ఉత్తరకొరియా వాటిని లెక్కచేయకుండా దాని బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంతో ముందుకు సాగింది. పెద్ద, మరింత అధునాతన క్షిపణులను ప్రయోగించింది.