North Korea: బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. తమ గగనతలాన్ని ఉల్లంఘించిన యూఎస్ గూఢచారి విమానాలను కూల్చివేస్తామని ఉత్తర కొరియా బెదిరించిన మరునాడే ఈ పరీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తర కొరియా జపాన్ సముద్దం అని పిలవబడే తూర్పు సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చెప్పారు. ఈ క్షిపణి జపాన్ సముద్ర జలాల్లో బుధవారం ఉదయం పడిందని తెలిపారు. ఇది తూర్పు దిశగా కొంత సేపు పయనించి జపాన్ కాలమానం ప్రకారం ఉదయం 11.15 సమయంలో సముద్ర జలాల్లో పడిందని ఆ దేశ కోస్ట్‌గార్డ్ వెల్లడించింది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంత అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి, దౌత్యం నిలిచిపోయింది. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ తన దేశాన్ని తిరుగులేని అణు రాజ్యంగా ప్రకటించాడు. ఆయుధాల అభివృద్ధిని పెంచాలని పిలుపునిచ్చారు.
Also Read: Heavy Rains: విషాదాన్ని మిగులుస్తున్న వర్షాలు.. దేశవ్యాప్తంగా 100 మందికి పైగా మృతి
Also Read
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
ఇక మంగళవారం రోజున.. ఉత్తర కొరియా నియంత్రిస్తున్న ప్రాంతం గగనతలంలోకి అమెరికా మిలిటరీ గూఢచారి విమానం ఎనిమిది సార్లు ప్రవేశించిందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తెలిపారు. తమ దేశానికి చెందిన యుద్ధ విమానాలు ఆ అమెరికా గూఢచారి విమానాన్ని తరిమికొట్టాయని అన్నారు. ఆ ప్రాంతంలో అమెరికా నిఘా కార్యకలాపాలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. మరోవైపు ఉత్తర కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానిస్తూ.. గతంలో అమెరికా తమ గగనతలంలోకి గూఢచారి విమానాలను ఎగురవేస్తోందని ఆరోపించింది. వాటిని కూడా కూల్చివేస్తామని హెచ్చరించింది.
ఉత్తర కొరియా భూభాగంలోకి అమెరికా గూఢచారి విమానాలను ఎగురవేయడాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఖండించారు. దక్షిణ కొరియా సైన్యంతో కలిసి అమెరికా ప్రామాణిక నిఘా కార్యకలాపాలు చేస్తోందని వారు తెలిపారు. ఆ మాటలపై స్పందించిన కిమ్ యో జోంగ్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ యూఎస్ మిలిటరీకి ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అమెరికా తన నిఘా కార్యకలాపాలను ముమ్మరం చేస్తోందని, ఇది ఉత్తర కొరియా సార్వభౌమాధికారం, భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!