ఓ అన్నదాత పట్ల మెట్రో సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. దేశానికి అన్నంపెట్టే కర్షకుడి పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఈ ఘటన బెంగళూరు మెట్రో రైల్లో చోటుచేసుకుంది.
రైతులంటేనే ఓ విధమైన వస్త్రధారణ కలిగి ఉంటారు. ప్రపంచంలో ఏ అన్నదాతను చూసినా ఇలానే ఉంటారు. అలాంటిది ఓ అన్నదాతకు సరైన బట్టలు లేవు అన్న కారణం చేత మెట్రో సిబ్బంది రైలు ఎక్కనివ్వలేదు. దుస్తులు మురికిపట్టి ఉన్నాయనే కారణంతోనే ఓ రైతును మెట్రో సిబ్బంది ట్రైన్ ఎక్కకుండా అడ్డుకున్న ఘటన ఆదివారం బెంగళూరులో చోటుచేసుకుంది.
బెంగళూరులోని రాజాజీనగర్ మెట్రోస్టేషన్‌లో ట్రైన్ ఎక్కడానికి వచ్చిన ఓ రైతు దుస్తులు శుభ్రంగా లేవని అతన్ని ట్రైన్ ఎక్కకుండా సెక్యూరిటీ సూపర్‌వైజర్ అడ్డుకున్నారు. ఇది గమనించిన ఓ యువకుడు ఆ వ్యక్తికి మద్దతుగా అధికారులను ప్రశ్నించాడు. దుమ్ము పట్టిన దుస్తులు వేసుకున్న వృద్ధుడిని ప్రయాణానికి అనుమతిస్తే, ఇతర ప్రయాణికులు అభ్యంతరం చెబుతారనే అనుమతించలేదని సెక్యూరిటీ సూపర్‌వైజర్ తెలిపారు. బెంగళూరు మెట్రో కేవలం వీఐపీల కోసమా లేక ప్రజల కోసమా అని ఓ యువకుడు సూపర్‌వైజర్‌ని ప్రశ్నించారు. దుస్తుల ఆధారంగా ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వమని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని ఆ యువకుడు సూపర్‌వైజర్‌ను కోరగా..అతడు సమాధానమివ్వలేదు. అనంతరం వృద్ధ రైతును మెట్రోలో ప్రయాణించేందుకు అనుమతించారు. ఈ విషయంపై స్పందించిన బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేసింది.
ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆ యువకుడిని ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా నెటిజన్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పేదల ఓటగ్లు కావాలని కానీ.. పేదలను రైలు ఎక్కనివ్వరా? అని ప్రశ్నిస్తున్నారు.
A poor Farmer was not allowed to enter Bengaluru Metro because he wasn't dressed appropriately for travel in Metro.
This is the real face of Congress.
They just want votes from poors but act like they are king when got power. pic.twitter.com/P0QyawkliA— Vaishali Poddar (@PoddarVaishali) February 26, 2024