బెంగాల్‌లో ఓటింగ్ ముగిసిన తర్వాత కూడా హింస కొనసాగుతోంది. శనివారం రాత్రి నుంచి పలుచోట్ల బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడికి కారణం తృణమూల్ కాంగ్రెస్ (TMC) మద్దతుదారులేనని బీజేపీ ఆరోపిస్తుంది. కాగా.. వరుస దాడులతో భయాందోళనకు గురైన పలువురు బీజేపీ కార్యకర్తలు ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. మరి కొందరు పార్టీ కార్యాలయాల్లో తలదాచుకున్నారు.
Delhi: కౌంటింగ్ నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు
ఓటమి భయంతోనే టీఎంసీ గూండాలు బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. మరోవైపు.. బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లను బెదిరించి అక్రమంగా అరెస్టు చేస్తున్నారని.. బీజేపీ ఐటీ సెల్ హెడ్, బెంగాల్ కో-ఇన్‌చార్జ్ అమిత్ మాల్వియా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఉత్తర 24 పరగణాల జిల్లా బసిర్‌హత్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సందేశఖాలీలో శనివారం ఓటింగ్ సమయం నుండి గందరగోళ వాతావరణం ఉంది. పోలీసులకు, మహిళలకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మరోవైపు.. హింసాత్మక ఘటనల్లో ఆదివారం రాత్రి మరో ఏడుగురు బీజేపీ మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్టయిన బీజేపీ మద్దతుదారుల సంఖ్య 12కి చేరింది. బీజేపీ మద్దతుదారులు పోలీసులపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
India bloc: ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఇండియా కూటమి నేతలు సమావేశం..
కాగా.. నదియా జిల్లాలోని దేవ్‌గ్రామ్ ప్రాంతంలో శనివారం రాత్రి బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన వెనుక రాష్ట్రంలోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఉన్నారని స్థానిక బీజేపీ నాయకత్వం ఆరోపిస్తోంది. మరోవైపు ఈ ఘటనతో తమకు సంబంధం లేదని తృణమూల్ కొట్టిపారేసింది. అదే సమయంలో.. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని భట్‌పరాలోని ప్రియాంకు పాండే అనే బీజేపీ నేత ఇంటిపై శనివారం అర్థరాత్రి కొందరు వ్యక్తులు బాంబులతో దాడి చేశారు.
