Indian railways: వెయిటింగ్ లిస్టులకు స్వస్తి.. ఎప్పుటినుంచంటే..!
- వెయింటింగ్ లిస్టులకు స్వస్తి
- 2032 లక్ష్యంగా పెట్టుకున్న రైల్వేశాఖ
- భద్రత.. సౌదుపాయాలపై దృష్టి పెట్టాలన్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ప్రయాణమంటే ఎలా ఉంటుందో చాలా మందికి అనుభవమే. కిక్కిరిసిన ప్రయాణికులు.. డోర్ల దగ్గర వ్రేలాడడం వంటి సీన్లు కనిపిస్తుంటాయి. జనరల్ బోగీల్లో కనీసం నిలబడేందుకు కూడా చోటు లేక ఇబ్బందులు పడుతుంటారు. ప్రస్తుతం రైల్వే వ్యవస్థలో జనరల్‌కు.. రిజర్వేషన్‌కు పెద్ద తేడా ఏమి ఉండడం లేదు. జనరల్ ప్యాసింజర్స్ కూడా రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కేసి ప్రయాణం చేస్తున్నారు. దీంతో రిజర్వేషన్ ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పూర్వ కాలం నుంచి ఉన్న ట్రైన్లే ఇప్పుడు నడుస్తున్నాయి. కొత్తగా రైళ్లు పెంచకపోవడం.. జనరల్ బోగీలు తగ్గించడం.. ఆ మధ్య కోవిడ్ సందర్భంగా కొన్ని రైళ్లు ఆపేయడంతో ప్రయాణికుల కష్టాలు మరింత తీవ్రం అయ్యాయి. ఇక ఎమర్జెన్సీ ప్రయాణికుల ఇబ్బందులు ఎవరికీ చెప్పుకోనక్కర్లేదు. అప్పటికప్పుడు రిజర్వేషన్ చేయించుకుందామంటే చాంతాడంతా వెయింటింగ్ లిస్ట్.. తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేయాలంటే లేనిపోని కష్టాలు తెచ్చుకోవడం జరుగుతుంటుంది. నాలుగు నెలల ముందుగానో.. లేదంటే మూడు నెలల ముందుగానో రిజర్వేషన్ చేసుకుంటేనే తప్ప సీట్లు దొరకని పరిస్థితులు నేటి రైల్వే వ్యవస్థలో దర్శనమిస్తున్నాయి. అయితే ఇలాంటి కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్ర రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: Exercise Time: ఆరోగ్యకరమైన శరీరం కోసం ఎంత సమయం వ్యాయామం చేయాలంటే..
Also Read
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
- Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే "రాగి" పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ఈ ఏడాది వేసవి కాలంలో అదనంగా నాలుగు కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేసినట్లుగా రైల్వే శాఖ గుర్తించింది. రిజర్వేషన్ చేయించుకుందామంటే సీట్లు దొరకని పరిస్థితులు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ప్రయాణాలు సాగించారు. ఈ నేపథ్యంలో వెయిటింగ్ లిస్టుకు స్వస్తి పలకాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా 2031-32 నాటికి ఆ సమస్యను పరిష్కరించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులందరూ 2032 నాటికి వెయిటింగ్ లేకుండా సీట్లు పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో భద్రతా మరియు మౌలిక సదుపాయాలపై రాజీ పడొద్దని రైల్వేమంత్రి అధికారులకు సూచించారు.
అలాగే వేసవిలో ఏసీలు, ఫ్యాన్లులు, వాటర్ కూలర్లు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేయాలని ఆదేశించారు. అలాగే రైళ్ల సమయపాలన, ప్రయాణికుల సౌకర్యాల దృష్టి పెట్టాలని రైల్వేమంత్రి సూచించారు.
ఇది కూడా చదవండి: Darshan Custody Extended : కన్నడ నటుడు దర్శన్ కి షాక్, పోలీస్ కస్టడీ పొడిగింపు
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!