NTV Telugu Site icon

petrol pump: పెట్రోల్ కావాలంటే.. పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాల్సిందే

Pertol Pump

Pertol Pump

petrol pump: పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెట్రోల్ బంకుల్లో వాహనదారులు తమ వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ ఉందని చూపిస్తేనే పెట్రోల్ పోయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం అక్టోబర్ 25నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. పీయూసీ సర్టిఫికెట్ లేకుండా ఢిల్లీలోని ఏ పెట్రోల్ బంకులు వాహనాలకు ఇంధనం నింపరాదంటూ ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. సెప్టెంబర్‌ 29న పర్యావరణ, రవాణా, ట్రాఫిక్‌ శాఖల అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విధానంపై ఈ ఏడాది మార్చిలో ప్రజల నుంచి అభిప్రాయం తీసుకున్నామని, మెజారిటీ దీని అమలుకు ఓకే చెప్పడంతోనే ఈ విధానం తీసుకువస్తున్నామని మంత్రి వివరించారు.

Read also: Indonesia: ఫుట్ బాల్ మైదానంలో తొక్కిసలాట.. 127మంది మృతి

ఢిల్లీలో వాయు కాలుష్యం ఇటీవల కాలంలో చాలా ఎక్కువైంది. మనుషుల ఆరోగ్యంపై దాని ప్రభావం ఎక్కువగా ఉంది. దీనికి తోడు ఇంధన వినియోగం కూడా రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో వాయు కాలుష్యం ఎక్కువుతోంది. దీంతో కాలుష్యాన్ని కంట్రోల్‌ చేయడానికి ప్రభుత్వాలు అధికారులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. వాయు కాలుష్యం మాత్రం తగ్గడం లేదు. గతంలోనూ ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సరి-బేసి విధానాన్ని తీసుకొచ్చింది. తాజాగా ‘నో పీయూసీ – నో ఫ్యూయల్‌’ని అమలు చేయనుంది. ఇకపై వాహనాలకు పొల్యుషన్‌ సర్టిఫికేట్‌ లేకపోతే పెట్రోల్‌ బంకుల్లో ఫ్యూయల్‌ పోయడానికి అనుమతి ఇవ్వడం కుదరదని తెలిపింది.

Read also:tag mahal : తాజ్ మహల్ పై వివాదం.. సుప్రీంకోర్టులో పిటీషన్

కాలుష్యాన్ని నియంత్రించేందుకు సవరించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) ప్రభావవంతంగా అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం అక్టోబర్ 3 న తన 24X7 వార్ రూమ్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. నిర్మాణాలు, వ్యర్థాల నిర్వహణ జీఆర్ఏపీ ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెన్స్(AQI) 200-300మధ్య ఉంటేనే అనుమతి ఇస్తామని రాయ్ మీడియాకు తెలిపారు. అలాగే AQI 300-400మధ్య ఉంటే డీజిల్ సెట్లపై నిషేదం ఉంటుందన్నారు. AQI 400-500 మధ్య నుంచి దాటితే వాహనాలపై కఠిన చర్యలుతీసుకుంటామని మంత్రి ప్రకటించారు. అక్టోబర్ 6నుంచి ఢిల్లీలో దుమ్ము వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభిస్తామన్నారు. నిర్మాణ స్థలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి దుమ్ము కాలుష్యాన్ని అరికట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

Show comments