Man kills wife: కట్నంగా ఫార్చ్యునర్ కారు ఇవ్వలేదని.. భార్యను చంపేసిన భర్త..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ నోయిడాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. వరకట్న వేధింపులతో ఓ మహిళ ప్రాణాలను కోల్పోయింది. కట్నం కింద ఫార్చ్యునర్ కారుతో పాటు 21 లక్షల రూపాయల క్యాష్ ఇవ్వలేదన్న కారణంతో.. మహిళ భర్త, అతని కుటుంబసభ్యులు ఆమెను చిత్రహింసలకు గురి చంపేశారు. గ్రేటర్ నోయిడాలోని ఖాడా చౌగన్పూర్ అనే గ్రామంలో నివాసం ఉండే వికాస్ అనే వ్యక్తికి.. 2022 డిసెంబర్ లో కరిష్మ అనే మహిళతో పెళ్లి అయింది. అప్పుడు కట్నం కింద వికాస్ కుటుంబానికి 11లక్షల రూపాయల క్యాష్ తో పాటు ఒక ఎస్యూవీ కారుని కరిష్మ తల్లిదండ్రులు ఇచ్చారు.
Read Also: RCB vs LSG Dream 11 Prediction: బెంగళూరు, లక్నో డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
Also Read
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
కానీ, పెళ్లి తర్వాత కూడా కట్నం గురించి కరిష్మను వికాస్ కుటుంబ సభ్యులు వేధించడం మొదలు పెట్టారు. ఇక, కరిష్మ సోదరుడు దీపక్ మాట్లాడుతూ..వికాస్ కుటుంబం అనేకసార్లు నా సోదరిని భౌతికంగా, మానసికంగా హింసించారు అని పేర్కొన్నాడు. కొన్ని నెలల క్రితం వికాస్-కరిష్మలకు ఆడ బిడ్డ పుట్టింది.. ఇక, అప్పటి నుంచి కట్నం వేధింపులు మరింత పెరిగాయన్నాడు. ఈ వ్యవహారం స్థానిక పంచాయతీ పెద్దల దృష్టికి కూడా వెళ్లాం.. రెండు కుటుంబాలు కలిసి విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నించామని దీపక్ వెల్లడించారు.
Read Also: Bandi Sanjay: ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ చేతులెత్తేసింది..! బండి కీలక వ్యాఖ్యలు
అయినా కూడా తమ కుటుంబం వికాస్ ఫ్యామిలీకి మరో 10 లక్షలు రూపాయలు ఇచ్చిందని మృతురాలి సోదరుడు దీపక్ చెప్పాడు. అప్పటికీ వరకట్న వేధింపులు ఆగలేదని చెప్పుకొచ్చాడు. కాగా.. కట్నం వేధింపులు ఇటీవలే నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాయి. వికాస్ కుటుంబం.. ఒక ఫార్చ్యునర్ తో పాటు 21 లక్షల రూపాయలను కట్నం కింద డిమాండ్ చేయడం మొదలు పెట్టింది అని అతడు వెల్లడించారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు వికాస్ తో పాటు అతడి కుంటుంబ సభ్యులు కొడుతున్నట్లు మృతురాలు కరిష్మ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. ఇక, విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన కరిష్మ అత్తగారి ఇంటికి రావడంతో అప్పటికే ఆమె విఘత జీవిగా పడి ఉంది. వికాస్, అతని తల్లిదండ్రులే వరకట్నం కోసం తమ బిడ్డను కొట్టి చంపేశారని కరిష్మ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!