Deepak Prakash: బీహార్ సీఎంగా నితీష్ కుమార్ 10వ సారి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి ఆయన బృందంలో 26 మంది మంత్రులుగా చోటు సంపాదించుకున్నారు. సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, విజయ్ చౌదరి వంటి అనుభవజ్ఞులైన నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే క్యాబినెట్ మంత్రుల జాబితాలో 12 మంది పేర్లు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచాయి. ఇందులో ముఖ్యంగా ఓ మంత్రి గురించి విస్తృత చర్చ జరుగుతోంది. ఆ మంత్రి ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. అలాగని ఎమ్మెల్సీ కూడా కాదు.. అయినా.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..? ఏంటా కథ పూర్తిగా తెలుసుకుందా..
రాష్ట్రీయ లోక్ మోర్చా (RLMO) బీహార్‌లోని బాజ్‌పట్టి, మధుబని, ససారం, దినారా, ఉజియార్‌పూర్, పారుతో సహా ఆరు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. వీరిలో మహతో బాజ్‌పట్టి నుంచి రామేశ్వర్ కుమార్, మధుబని నుంచి మాధవ్ ఆనంద్, ససారమ్ నుంచి స్నేహలత, దినారా నియోజకవర్గం నుంచి అలోక్ కుమార్ సింగ్ గెలుపొందారు. ససారమ్ ఎమ్మెల్యే స్నేహలత.. రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా భార్య.. అయితే.. ఎమ్మెల్యే స్నేహలత, ఉపేంద్ర కుష్వాహా కుమారుడు దీపక్ ప్రకాష్.. దీపక్ నిన్న బీహార్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తల్లి ఎమ్మెల్యే, తండ్రి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కానీ.. దీపక్ మాత్రం విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఎలాంటి పదవి లేకుండా డైరెక్ట్ మంత్రి అయ్యారు. యువ నాయకత్వం, సాంకేతిక, రాజకీయ క్రియాశీలత దృష్ట్యా, దీపక్‌ను మంత్రివర్గంలో చేర్చడం ద్వారా కొత్త తరానికి అవకాశాలను కల్పించే NDA వ్యూహంలో భాగంగా మారుతుందని చెబుతున్నారు.
READ MORE: TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్..
అయితే.. రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) అధినేత ఉపేంద్ర కుష్వాహా కుమారుడు దీపక్ ప్రకాష్‌ను తమ పార్టీ కోటా నుంచి ఏకైక మంత్రి పదవికి నామినేట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాదు.. దీపక్‌కి MLC సీటు కూడా ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. తాజాగా మంత్రి దీపక్ ప్రకాష్ మాట్లాడుతూ.. “నేను రాజకీయాలకు కొత్త కాదు. నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో పాల్గొంటున్నాను. రాజకీయ నాయకులు ఎలా పనిచేస్తారో దగ్గర నుంచి చూశాను. నేను కూడా రాజకీయ కార్యకలాపాల్లో ఒక భాగమే. నా పేరు ఎందుకు ఖరారు చేశారో నా తండ్రి ఉపేంద్ర కుష్వాహా మాత్రమే చెప్పగలరు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కొద్దిసేపటి ముందు నా పేరు ఖరారు అయిందని నాకు తెలిసింది” అని అన్నారు.