Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Nitish Kumar Resigns To Stake Claim To Form Government With Bjp Shortly

Bihar Crisis: ముఖ్యమంత్రి పదవికి నితీష్‌కుమార్‌ రాజీనామా.. నెక్ట్స్ ఏంటంటే..!

Published Date :January 28, 2024 , 11:25 am
By Mahesh Jakki
Bihar Crisis: ముఖ్యమంత్రి పదవికి నితీష్‌కుమార్‌ రాజీనామా.. నెక్ట్స్ ఏంటంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bihar Crisis: బీహార్ రాజకీయ సంక్షోభం చివరంఖానికి చేరుకుంది. అంతా ఊహించినట్టుగానే మహాకూటమికి నితీష్‌కుమార్ గుడ్‌బై చెప్పేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌‌ను కలిసి నితీష్ రాజీనామా లేఖను సమర్పించారు. అంతకముందు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజీనామాకు గల కారణాలను ఎమ్మెల్యేలకు నితీష్ తెలియజేశారు. నితీష్‌కుమార్ మాట్లాడుతూ..”గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించాను.. సీఎం పదవికి రాజీనామా చేశాను.. త్వరలో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తాం.. మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవు.. అందుకే మహాకూటమి నుంచి బయటకు వచ్చా.. ఇండియా కూటమి బలహీనపడింది.” అని నితీష్ అన్నారు.

గత మూడు, నాలుగు రోజులుగా బీహార్ ప్రభుత్వంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం వచ్చిదంటూ వార్తలు షికార్లు చేశాయి. కానీ నితీష్‌కుమార్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి పొలిటికల్ సస్పెన్స్‌కు తెరలేపుతూ మహాకూటమి నుంచి నితీష్ బయటకు వచ్చేశారు. మరోసారి బీజేపీతో కలిసి నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. పట్నాలో ప్రస్తుతం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఏం చూసిస్తే అలా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే జేపీ నడ్డాతో సహా పలువురు బీజేపీ ముఖ్యనేతలు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3 గంటలకు బీహార్‌కు చేరుకోనున్నారు. అనంతరం నితీష్‌కుమార్‌తో సమావేశం అనంతరం సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో ఏడోసారి ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నితీష్‌తో బీజేపీకి చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

బీహార్‌లో ప్రస్తుతం ఇలా..
బీహార్‌ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. కనీస మెజార్టీకి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ప్రస్తుతం ఆర్జేడీకి 79, బీజేపీకి 78కి, జేడీయూకి 45, కాంగ్రెస్‌కు 19, వామపక్షాలకు 16, హెచ్‌ఏఎం(ఎస్)కు నలుగురు, ఎంఐఎంకు ఒకరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, వామపక్షాలు ఆర్జేడీతో కలిసే ఉన్నాయి. ఈ మూడు పార్టీల బలం 114 మంది ఉన్నారు. మెజార్టీకి మరో 8 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. జేడీయూ-బీజేపీకి మాత్రమే 123 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే బలం ఉంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bihar
  • Bihar Crisis
  • Bihar Political Crisis
  • bihar politics
  • nitish kumar

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions