Site icon NTV Telugu

Nitish Kumar: ఎన్డీయేలో జేడీయూ చేరికపై నితీష్‌ కుమార్ ఏమన్నారంటే?

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో తమ పార్టీ తిరిగి చేరుతుందన్న ఊహాగానాలను జేడీయూ అధినేత, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తోసిపుచ్చారు. ఎన్డీయేలో తిరిగి చేరతారనే మీడియాలో ఊహాగాహాలను ఆయన కొట్టిపారేశారు. ఎన్డీయే ఏడాది క్రితమే బంధం తెగిపోయిందని, ప్రతిపక్ష ఇండియా కూటమిని బలోపేతం చేయడమే తన ప్రధాన ధ్యేయమని నితీష్‌కుమార్‌ పేర్కొన్నారు. ఊహాగానాలపై విలేకరుల ప్రశ్నలకు నితీష్ కుమార్ స్పందిస్తూ.. “క్యా ఫాల్తు బాత్ హై” (ఏం చెత్త మాటలు!) అని అన్నారు.

Also Read: Khalistani Terrorist: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్‌ భారత్‌ను ముక్కలు చేయాలనుకున్నాడు..!

బీజేపీ వ్యతిరేక ఇండియా కూటమిలో కీలక వ్యక్తి అయిన జేడీయూ నాయకుడు నితీష్‌కుమార్‌కు మంచి ప్రధాని అయ్యే అన్ని లక్షణాలు ఉన్నాయని పార్టీ సహచరులు మాట్లాడడం పట్ల తన అసంతృప్తిని వ్యక్తి చేశారు. ఇలాంటి ప్రకటనలు చేయొద్దని తాను ఇప్పటికే తన పార్టీ సహచరులకు చెప్పానన్నారు. ఇండియా కూటమి ఐక్యతను బలోపేతం చేయడమే తన ఏకైక కోరిక అని నితీష్ పేర్కొన్నారు. తాను ఆ దిశలో మాత్రమే పనిచేస్తున్నానన్నారు.

Also Read: VIVO Y56: స్మార్ట్‌ఫోన్‌ వివో వై56 కొత్త వెర్షన్.. ధర ఎంతంటే?

బీహార్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, సీనియర్ జేడీ(యు) నాయకుడు మహేశ్వర్ హాజరై మాట్లాడుతూ.. ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ కంటే మరెవ్వరూ సమర్థులు కాదని అన్నారు. మంత్రివర్గ విస్తరణకు అవకాశంపై అడిగిన ప్రశ్నకు.. నితీష్‌ కుమార్ తన డిప్యూటీ తేజస్వి యాదవ్ కోర్టులో బంతిని ఉంచారు. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలపై తనను అడిగిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రశ్న ఉప ముఖ్యమంత్రిని అడగండి అంటూ మాట్లాడారు.జేడీయూ నేత నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం 28 మంది మంత్రులు ఉన్నారు. లాలూ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామా చేసినప్పటికీ సింహభాగం అనుభవిస్తున్నారు. ఇటీవల లోక్‌సభలో బీఎస్‌పీ శాసనసభ్యుడు డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై నితీష్ కుమార్ మాట్లాడుతూ.. “ఈ అంశాన్ని వదిలేయండి. మా ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పని చేస్తోంది” అని అన్నారు.

Exit mobile version