Nithiin: ఈ మధ్య కాలంలో యంగ్ హీరో నితిన్‌కు సరైన హిట్ పడలేదు. ఆయన రాబిన్‌హుడ్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండగా, ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి వేణు ఎలదండి దర్శకత్వంలో ఎల్లమ్మ కాగా, మరొకటి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో స్వారీ అనే సినిమా. అయితే, రాబిన్‌హుడ్ సినిమా డిజాస్టర్ కావడం, ఆ తర్వాత వచ్చిన తమ్ముడు అంతకు మించిన డిజాస్టర్ కావడంతో మార్కెట్‌లు వర్కౌట్ కాక, ఎల్లమ్మ సినిమా డ్రాప్ అయింది.
Heart Attack Risk: గుండెపోటు వచ్చే రిస్క్‌ని ముందుగా గుర్తించే ఏకైక పరీక్ష ఏంటో తెలుసా?
ఇక, ఇప్పుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో రూపొందాల్సిన స్వారీ సినిమా కూడా దాదాపు నిలిచిపోయే పరిస్థితికి చేరుకుందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో రూపొందించాలని అనుకున్నారు. ఈ మేరకు, ఇప్పటికే విక్రమ్ కుమార్ ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేశాడు. అయితే, ఈ సినిమాని నిర్మించాల్సిన యువి క్రియేషన్స్ సినిమా పూర్తిగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా మీద ఫోకస్ చేసింది.
Social Media Reels Addiction: రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే ఈ సమస్యలు మీతోనే!
ఈ సినిమా మీద భారీగా ఖర్చు పెట్టడంతో, ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు మరే సినిమా పట్టాలెక్కించకూడదని నిర్ణయం తీసుకుంది. దీంతో, ప్రస్తుతానికి నితిన్ సినిమాని హోల్డ్‌లో పెట్టారు. ఈ గ్యాప్‌లో నితిన్, శ్రీను వైట్లతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని దసరా సందర్భంగా అనౌన్స్ చేసి, పట్టాలెక్కించే పనులు పడ్డారు.
