NTV Telugu Site icon

Intermediate Paper Leak : ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్.. క్లారిటీ ఇచ్చిన కలెక్టర్

Leaks

Leaks

నిర్మల్ లో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇవి వదంతులు మాత్రమే అని, అసత్య వార్తలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కడెం జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ పలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నవి అసత్యపు వార్తలని స్పష్టం చేశారు. అవాస్తవ సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని, కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.

READ MORE: Crime: కాళ్లలో 10 మేకులు.. మహిళ మృతదేహం.. చేతబడి కారణమా..?

కాగా… తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు ప్రశాతంగా మొదలయ్యాయి. బుధవారం(మార్చి 5) ఉదయం ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు రెండో భాష పేపర్‌ 1కు పరీక్ష జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం మూడు గంటల వరకు పరీక్ష జరగగా.. విద్యార్థులను గంట ముందు నుంచే అంటే ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఇక పరీక్ష మొదలయ్యాక 9.05 నిమిషాలకు వచ్చిన విద్యార్థులను కూడా పరీక్షకు అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తొలిరోజు పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులకు వాచ్‌లు, సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను లోనికి అనుమతించలేదు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇంటర్‌ ఫస్ట్ ఇయర్‌ పరీక్షలు నేటి నుంచి మార్చి 19వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. అలాగే..ఈ రోజు(మార్చి 6)న ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి.