NTV Telugu Site icon

Nimmaka Jayakrishna: పాలకొండ నుంచి జనసేన తరఫున పోటీ చేస్తా..

Nimmaka Jayakrishna

Nimmaka Jayakrishna

Nimmaka Jayakrishna: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ సీనియర్‌ నేతగా ఉన్న నిమ్మక జయకృష్ణ పవన్‌ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మరోవైపు జనసేన తరుఫున మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పాలకొండ, అవనిగడ్డ స్థానాల కోసం జనసేన గెలుపు గుర్రాలను అన్వేషిస్తోంది. పాలకొండ టికెట్ నిమ్మక జయకృష్ణకు, అవనిగడ్డ సీటు మండలి బుద్ధ ప్రసాద్‌కు ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నిమ్మక జయకృష్ణ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తాను పాలకొండ నుంచి జనసేన తరఫున పోటీ చేస్తానని తన మనస్సులోని మాటను బయటపెట్టారు.

జనసేనలో చేరిన నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ.. “పవన్ సమక్షంలో జనసేనలో చేరానని.. పాలకొండ నుంచి జనసేన తరపున పోటీ చేస్తానని వెల్లడించారు. ఈ విషయంలో పవన్ సానుకూలంగా ఉన్నారన్నారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్ కలిసి నియోజకవర్గాన్ని దోచేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరిని కూటమి తరపున తరిమి కొడతామన్నారు నిమ్మక జయకృష్ణ.

Read Also: Chandrababu: టీడీపీ కేడర్‌తో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. పింఛన్లపై కీలక ప్రకటన

టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తులో భాగంగా అవనిగడ్డ, పాలకొండ స్థానాలు జనసేన పార్టీకి వెళ్లాయి. దీంతో గతంలో ఇక్కడి నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసిన మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణకు నిరాశ ఎదురైంది. దీంతో టీడీపీకి గుడ్ బై చెప్పిన ఇద్దరు నేతలు జనసేన కండువా కప్పుకున్నారు. అవనిగడ్డ, పాలకొండ స్థానాలలో పలువురు పేర్లతో జనసేన సర్వేలు చేయించింది. 21 స్థానాల్లోనూ కచ్చితంగా గెలవాలని పట్టుదలగా ఉన్న పవన్ కళ్యాణ్.. సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆ రెండు స్థానాలకూ అభ్యర్థుల ప్రకటనను పెండింగ్ పెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సీనియర్ నేతలైన వీరికి అవకాశం ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Show comments