Site icon NTV Telugu

Nikki Haley: రష్యా చమురు దిగుమతులపై జాగ్రత్తగా ఉండండి.. భారత్‌పై కీలక వ్యాఖ్యలు!

Nikki Haley

Nikki Haley

Nikki Haley: అమెరికా మాజీ రాయబారి, భారతీయ మూలాలున్న రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ ఆదివారం భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ సన్నిహితురాలైన ఆమె, భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్న విషయంలో హెచ్చరిస్తూ.. వీలైనంత త్వరగా వైట్ హౌస్‌తో చర్చలు జరపాలని సూచించారు. దశాబ్దాలుగా ఉన్న స్నేహం, నమ్మకంతో ఇలాంటి ఉద్రిక్తతలను అధిగమించవచ్చు. కానీ, రష్యా చమురు సమస్యను సీరియస్‌గా తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

CM Revath Reddy: త్వరలోనే ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పా.. ఇలా కలుస్తాననుకోలేదు!

రెండు దేశాల మధ్య వాణిజ్య విభేదాలు, రష్యా చమురు దిగుమతుల వంటి సమస్యలు కఠిన చర్చల ద్వారానే పరిష్కారం పొందగలవు. అయితే, ముఖ్యమైన అంశాన్ని మర్చిపోకూడదు.. అది చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడమే. అమెరికాకు భారత్ స్నేహితుడిగా ఉండాలని నిక్కీ హేలీ తన X పోస్ట్‌లో పేర్కొంది. అమెరికా-భారత్ సంబంధాలు తారుమారవుతున్నాయని, చైనా పెరుగుతున్న ఆకాంక్షలను అడ్డుకోవాలంటే ఈ బంధాన్ని మరింత బలపరచడం అవసరమని ఆమె తెలిపారు. భారత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ చైనాతో సమానంగా విరోధిగా చూడకూడదని, టారిఫ్‌లు లేదా ఇండియా-పాక్ మధ్య అమెరికా పాత్ర వంటి అంశాలు రెండు దేశాల మధ్య విభేదాలను పెంచకూడదని హేలీ సూచించారు.

Cheteshwar Pujara: 20 ఏళ్ల క్రికెట్ జర్నీకి రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్!

ఇక, ఇటీవల అమెరికా భారత్‌పై విధించిన ద్వితీయ టారిఫ్‌లు రెండు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా విధించిన ఈ కొత్త టారిఫ్‌లతో పాటు, అమెరికా భారత ఎగుమతులపై విధించిన సుంకాలు 50 శాతం దాటాయి. ఇది ఇప్పటివరకు ట్రంప్ విధించిన అత్యధిక సుంకంగా భావిస్తున్నారు. బ్రెజిల్ తర్వాత భారత్‌పైనే ఈ స్థాయిలో ఒత్తిడి వచ్చింది. భారత్ ఈ చర్యను ఖండించింది. ముఖ్యంగా వస్త్రాలు, సముద్ర ఆహార ఎగుమతులపై ఈ సుంకాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ నేపథ్యంలో స్పష్టమైన సందేశం ఇస్తూ.. మన రైతులు, మత్స్యకారుల ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ రాజీ పడము. దాని కోసం నేను ఎంతటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

Exit mobile version