Nikki Haley: రష్యా చమురు దిగుమతులపై జాగ్రత్తగా ఉండండి.. భారత్‌పై కీలక వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikki Haley: అమెరికా మాజీ రాయబారి, భారతీయ మూలాలున్న రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ ఆదివారం భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ సన్నిహితురాలైన ఆమె, భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్న విషయంలో హెచ్చరిస్తూ.. వీలైనంత త్వరగా వైట్ హౌస్‌తో చర్చలు జరపాలని సూచించారు. దశాబ్దాలుగా ఉన్న స్నేహం, నమ్మకంతో ఇలాంటి ఉద్రిక్తతలను అధిగమించవచ్చు. కానీ, రష్యా చమురు సమస్యను సీరియస్‌గా తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
CM Revath Reddy: త్వరలోనే ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పా.. ఇలా కలుస్తాననుకోలేదు!
Also Read
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
రెండు దేశాల మధ్య వాణిజ్య విభేదాలు, రష్యా చమురు దిగుమతుల వంటి సమస్యలు కఠిన చర్చల ద్వారానే పరిష్కారం పొందగలవు. అయితే, ముఖ్యమైన అంశాన్ని మర్చిపోకూడదు.. అది చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడమే. అమెరికాకు భారత్ స్నేహితుడిగా ఉండాలని నిక్కీ హేలీ తన X పోస్ట్‌లో పేర్కొంది. అమెరికా-భారత్ సంబంధాలు తారుమారవుతున్నాయని, చైనా పెరుగుతున్న ఆకాంక్షలను అడ్డుకోవాలంటే ఈ బంధాన్ని మరింత బలపరచడం అవసరమని ఆమె తెలిపారు. భారత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ చైనాతో సమానంగా విరోధిగా చూడకూడదని, టారిఫ్‌లు లేదా ఇండియా-పాక్ మధ్య అమెరికా పాత్ర వంటి అంశాలు రెండు దేశాల మధ్య విభేదాలను పెంచకూడదని హేలీ సూచించారు.
Cheteshwar Pujara: 20 ఏళ్ల క్రికెట్ జర్నీకి రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్!
ఇక, ఇటీవల అమెరికా భారత్‌పై విధించిన ద్వితీయ టారిఫ్‌లు రెండు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా విధించిన ఈ కొత్త టారిఫ్‌లతో పాటు, అమెరికా భారత ఎగుమతులపై విధించిన సుంకాలు 50 శాతం దాటాయి. ఇది ఇప్పటివరకు ట్రంప్ విధించిన అత్యధిక సుంకంగా భావిస్తున్నారు. బ్రెజిల్ తర్వాత భారత్‌పైనే ఈ స్థాయిలో ఒత్తిడి వచ్చింది. భారత్ ఈ చర్యను ఖండించింది. ముఖ్యంగా వస్త్రాలు, సముద్ర ఆహార ఎగుమతులపై ఈ సుంకాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ నేపథ్యంలో స్పష్టమైన సందేశం ఇస్తూ.. మన రైతులు, మత్స్యకారుల ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ రాజీ పడము. దాని కోసం నేను ఎంతటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
India must take Trump's point over Russian oil seriously, and work with the White House to find a solution. The sooner the better.
Decades of friendship and good will between the world's two largest democracies provide a solid basis to move past the current turbulence.…
— Nikki Haley (@NikkiHaley) August 23, 2025
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!