Nikki Haley: అమెరికా అధ్యక్ష బరి నుంచి నిక్కీ హేలీ నిష్క్రమణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్ష బరి నుంచి నిక్కీ హేలీ (Nikki Haley) నిష్క్రమించనున్నారు. అధ్యక్ష పోటీకి కావాల్సిన మెజార్టీని ఆమె సాధించలేకపోయారు. దీంతో ఆమె బరి నుంచి తప్పుకునే పరిస్థితి నెలకొంది. దీంతో మరోసారి జో బైడెన్-ట్రంప్ మధ్యే ఫైటింగ్ జరగనుంది.
అగ్రరాజ్యం అమెరికాలో (USA) అధికార పీఠం కోసం జరిగే ఎన్నికల్లో మరోసారి అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రత్యర్థులుగా ఉండేటట్లు కనిపిస్తోంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలగాలని భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ (Nikki Haley) నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో ఆమె అధికారిక ప్రకటన చేయనున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది.
Also Read
- NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..
- RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
- Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్‌కు భారత్ విజ్ఞప్తి
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
మంగళవారం జరిగిన ‘సూపర్ ట్యూస్‌డే ప్రైమరీల’ పోరులో ఈమె దారుణంగా ఓడిపోయారు. రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక కావడానికి 1,215 మంది ప్రతినిధుల మద్దతు కావాల్సి ఉంటుంది. కానీ ఫలితాల తర్వాత ట్రంప్‌నకు 995 మంది మద్దతు ఉండగా.. హేలీ ఖాతాలో 89 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ట్రంప్‌తో పోలిస్తే భారీ వెనుకంజలో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోటీని విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటలకు ఆమె ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్‌నకు పోటీగా.. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామితో పాటు డజను మందికి పైగా బరిలోకి దిగారు. అయితే ప్రైమరీలు మొదలైన నాటి నుంచే ట్రంప్ ఆధిక్యంలో కొనసాగారు. దీంతో ప్రధాన పోటీదారులు వరుసగా రేసు నుంచి వైదొలిగారు. చివరగా మిగిలిన హేలీ కూడా పోటీని విరమించుకునేందుకు సిద్ధమయ్యారు. అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ పోటీ ఖాయం కానుంది. అటు డెమోక్రాట్ల తరఫున బైడెన్ ముందంజలోనే ఉన్నారు. దీంతో మరోసారి బైడెన్-ట్రంప్ ఎన్నికల్లో తలపడనున్నారు. ఈ ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
ఇదిలా ఉంటే జో బైడెన్ ఆరోగ్యరీత్యా పోటీ నుంచి తప్పుకుంటారని వార్తలు వినిపించాయి. ఆయన స్థానంలో మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిచెల్ పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలను ఆమె ఖండించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మిచెల్ తేల్చిచెప్పారు.
తాజావార్తలు
-
NBK 111: ఆ సినిమా టీజర్ మామూలుగా లేదు.. బాలయ్యను వేరే లెవల్లో చూస్తారు: తమన్
-
Chairman’s Desk : కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా గేమ్ ఛేంజరా?
-
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..
-
Thaman: ఇదే నా లాస్ట్ సినిమా: తమన్
-
RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!