Spy : నిఖిల్ ‘స్పై’ మూవీ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. కార్తికేయ 2 మూవీ తో వచ్చిన క్రేజ్ తో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘స్పై’భారీ అంచనాలతో విడుదల అయి బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. పాన్ ఇండియా రేంజ్లో ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.స్పై యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. స్పై సినిమాలో ఐశ్వర్య మీనన్, అభినవ్ గోమటం, జిస్సు సెంగుప్త, నితిన్ మెహతా, ఆర్యన్ రాజేశ్, సాన్య ఠాకూర్, మక్రంద్ దేశ్ పాండే మరియు రవివర్మ కీలకపాత్రలు పోషించారు. హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాలో క్యామియో రోల్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ మరియు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.. ఇదిలా ఉంటే స్పై సినిమా ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అయింది.స్పై సినిమా ఈటీవీ తెలుగు ఛానెల్లో ప్రసారం కానుంది. డిసెంబర్ 3 వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు స్పై మూవీ ఈటీవీలో ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని ఈటీవీ తాజాగా వెల్లడించింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించిన మిస్టరీని చూపించబోతున్నామంటూ మూవీ యూనిట్ బాగా ప్రచారం చేయడంతో స్పై సినిమాపై భారీ గా అంచనాలు నెలకొన్నాయి. అయితే. సుభాష్ చంద్రబోస్ మిస్టరీ గురించి చిత్రంలో చాలా తక్కువ గా చూపించారు.అందులోనూ ఈ సినిమా కథ, కథనాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవటంతో మొదటి నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో థియేటర్లలో ఈ చిత్రం పరాజయం పాలైంది.స్పై సినిమా తీవ్రంగా నిరుత్సాహపరటంతో అభిమానులకు క్షమాపణ చెబుతూ ఓ లెటర్ కూడా నిఖిల్ అప్పట్లో పోస్ట్ చేశారు. ఈ సినిమా పరాజయం బాధ్యతను తాను తీసుకుంటున్నానని, భవిష్యత్తులో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యమైన సినిమాలను చేస్తానని ఆయన పేర్కొన్నారు.స్పై మూవీ ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో జూలై నుంచి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
తాజావార్తలు
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్‌లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!