Site icon NTV Telugu

CP CV Anand: భారత్‌లోనే ఉండిపోయేందుకు నైజీరియన్స్ కొత్త ప్లాన్.. సీవీ ఆనంద్ వెల్లడి..!

Cp Cv Anand

Cp Cv Anand

హైదరాబాదులో నేరాలు చేస్తున్న నైజేరియన్స్‌ను డిపోర్ట్ చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. డిపోర్టు చేసిన తర్వాత కూడా చాలా మంది నకిలీ పాస్ పోర్ట్ లతో ఇండియాలోకి ప్రవేశిస్తున్నారని, అలాంటి వాళ్లను కూడా అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో జోనల్ సైబర్ సెల్స్ ను ప్రారంభించిన ఆయన కార్యక్రమంలో ప్రసంగించారు. నైజీరియన్లను వాళ్ళ దేశానికి డిపోర్ట్ చేస్తారని భయంతో ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారని సంచలన విషయాన్ని తెలిపారు.

READ MORE: Sreeleela: ‘ఉస్తాద్’ కోసం బల్క్ డేట్స్ ఇచ్చిన శ్రీలీల

చివరికి 498 కేసులో అయిన ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టించుకుంటున్నారని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నైజేరియన్స్ పై కేసు నమోదు అయితే చట్టపరంగా డిపోర్ట్ చేయలేమని స్పష్టం చేశారు. వారిపై కేసు ట్రయల్ పూర్తి చేసి క్లోజ్ అయ్యే వరకు డిపోర్టు చేయలేమని వివరించారు. బంగ్లాదేశ్ కి చెందిన పౌరులు కూడా శరణార్థులుగా ఇక్కడికి వస్తున్నారని.. ఈ వ్యవహారాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అడ్డుదారుల్లో ఇక్కడ ఆధార్ పొందుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు.

READ MORE: DOST Phase-1: దోస్త్ మొదటి విడత సీట్లు కేటాయింపు..సీట్ వచ్చిందా? చెక్ చేసుకోండి..

ఉగ్రవాద లింక్స్ ఉన్న సమీర్ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుందని సీపీ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఎన్‌ఐఏ నాలుగు చోట్ల సోదాలు చేసిందని.. ఎన్‌ఐఏ విచారణ, సోదాలకు హైదరాబాద్ పోలీసుల సహకారం అడిగితే చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ లో సమీర్ తో ఇంకా ఎవరెవరికి లింక్స్ ఉన్నాయనే అంశాన్ని ఎన్‌ఐఏ దర్యాప్తులో బయటికి వస్తాయని తెలిపారు. అలాగే.. ఫోన్ టాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని సీవీ ఆనంద్ వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని..ప్రస్తుతానికి ఉన్న చర్యలు అన్ని హోల్డింగ్ లోకి వెళ్లిపోతాయన్నారు. కొత్త పాస్‌పోర్టు జారీ పక్రియ మొత్తం కూడా విదేశీ వ్యవహారాల శాఖ చూసుకుంటుందని.. పాస్‌పోర్టు ఎప్పుడు ఎలా జారీ చేస్తారనే విషయాన్ని తాము కూడా తెలుసుకోవాలన్నారు. ఇంటర్పోల్, డిస్పోర్ట్ ఇతర ఇతర చర్యలు అన్ని కూడా హోల్డింగ్ లోకి పోతాయని వెల్లడించారు.

Exit mobile version