సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య వృద్ధులే లక్ష్యంగా అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల ఆటకు మరో వృద్ధుడు దారుణంగా మోసపోయాడు. అతని వద్ద నుంచి ఏకంగా రూ. 80 లక్షలు కొట్టేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో 3 రోజులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేసేశారు. డిజిటల్ అరెస్ట్.. ఇది సైబర్ క్రిమినల్స్‌కు చాలా కీలకమైన పదం. దీన్ని ఉపయోగించి అమాయకులైన వారిని టార్గెట్ చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.…
హైదరాబాదులో నేరాలు చేస్తున్న నైజేరియన్స్‌ను డిపోర్ట్ చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. డిపోర్టు చేసిన తర్వాత కూడా చాలా మంది నకిలీ పాస్ పోర్ట్ లతో ఇండియాలోకి ప్రవేశిస్తున్నారని, అలాంటి వాళ్లను కూడా అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో జోనల్ సైబర్ సెల్స్ ను ప్రారంభించిన ఆయన కార్యక్రమంలో ప్రసంగించారు. నైజీరియన్లను వాళ్ళ దేశానికి డిపోర్ట్ చేస్తారని భయంతో ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారని సంచలన విషయాన్ని తెలిపారు.
Aadhaar Card Safe: ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు మనదేశంలో అత్యంత కీలకమైన గుర్తింపు కార్డు. కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, సిమ్ కార్డు తీసుకోవాలన్నా, ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఒకేఒక్క ఆధారం ఆధార్ కార్డు. అయితే, మీ ఆధార్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారా అని అనుమానమా? లేదా మీ పేరు మీద అకౌంట్లు తెరవడం, సిమ్ కార్డులు కొనడం, ఇతర మోసాలు చేయడం సాధ్యమే. అందుకే మీ ఆధార్‌ను ఎవరైనా అనుమతి లేకుండా వాడుతున్నారా…