పెరిగిన టోల్ ఛార్జీలు ఈ రోజు (జూన్ 3) అర్ధరాత్రి నుండి మార్చి 31, 2025 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHIA) ఉత్తర్వులను జారీ చేసింది. ఈ అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా టోల్‌లు పెరగనున్నాయి. టోల్‌లు సగటున 5 శాతం పెరుగుతాయని NHIA తెలిపింది. కొద్ది రోజుల క్రితమే ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నా.. ఎన్నికల కారణంగా ఆలస్యమైంది. అయితే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ పెంపుదల అమలులోకి రానుంది. ఇక పోతే ఈ నిర్ణయాన్ని జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లగా ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేయాలని ఎన్నికల సంఘం NHIAని ఆదేశించింది.
Gam Gam Ganesha: దూసుకెళ్తున్న ‘గం గం గణేశ’.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ఇలా..
టోల్ ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణంలో మార్పులతో ముడిపడి ఉన్న రేట్లను సవరించడానికి వార్షిక కసరత్తులో భాగంగా టోల్ రుసుములో మార్పులను చేయవచ్చు. నేషనల్ హైవే నెట్‌వర్క్‌లో దాదాపు 855 యూజర్ ఫీజు ప్లాజాలు ఉన్నాయి. వీటిపై జాతీయ రహదారుల రుసుము రూల్స్, 2008 ప్రకారం వినియోగదారు రుసుము నిర్ణయిస్తారు. వీటిలో దాదాపు 675 పబ్లిక్ ఫండ్డ్ ఫీజు ప్లాజాలు, అలాగే 180 రాయితీదారులచే నిర్వహించబడేవి ఉన్నాయి.
Dinner: రాత్రి త్వరగా భోజనం చేస్తే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?