New Zealand Semis Chances: హ్యాట్రిక్ ఓటములు.. డేంజర్ జోన్లో న్యూజీలాండ్! సెమీస్ ఛాన్సెస్ ఇలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How New Zealand Can Qualify ODI World Cup 2023 Semi Finals: వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభంలో వరుస విజయాలు సాధించిన న్యూజీలాండ్.. ఆపై హ్యాట్రిక్ ఓటములతో డేంజర్ జోన్లోకి వెళ్లింది. ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లను ఓడించిన కివీస్.. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై చేతులెత్తేసింది. పూణే వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్ చేతిలో 190 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హ్యాట్రిక్ పరాజయాలతో సెమీస్ అవకాశాలను న్యూజీలాండ్ సంక్లిష్టం చేసుకుంది. ప్రొటీస్ చేతిలో కివీస్ ఓడడంతో ఆస్ట్రేలియాతో పాటు పాకిస్తాన్, అఫ్గానిస్థాన్‌లను కలిసొచ్చింది. ప్రస్తుతం న్యూజీలాండ్ సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. 190 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో రన్‌రేట్ పడిపోయి నాలుగో స్థానానికి చేరింది. ఆరు మ్యాచ్‌లలో నాలుగు గెలిచిన ఆస్ట్రేలియా కంటే కివీస్ (ఏడు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు) వెనుకపడిపోయింది. దాంతో సెమీస్ చేరాలంటే.. చివరి రెండు మ్యాచ్‌ల్లో న్యూజీలాండ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తదుపరి మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ (నవంబర్ 4న), శ్రీలంక (నవంబర్ 9)తో కివీస్ తలపడాల్సి ఉంది.
Also Read
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
Also Read: IND vs SL Dream11 Prediction: భారత్, శ్రీలంక డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
పాకిస్థాన్, శ్రీలంక జట్లపై గెలిస్తే 12 పాయింట్లతో న్యూజీలాండ్ సెమీస్ బెర్త్ దక్కించుకుంటుంది. ఒకవేళ ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. చివరి 2 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ గెలిస్తే కివీస్ ఖాతాలో 10 పాయింట్స్ ఉంటాయి. అప్పుడు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ టీమ్స్ ఇతర మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ జట్లు తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిపోవాల్సి ఉంటుంది. అలాకాకుండా ఆసీస్ ఒక్కటి గెలిచినా.. రన్ రేట్ కీలకం అవుతోంది. ప్రస్తుతానికి పాక్ నుంచి పెద్దగా ముప్పు లేదనే చెప్పాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్‌కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
-
IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
-
Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!