Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- న్యూజిలాండ్‌లో భారీ భూకంపం
- సునామీ హెచ్చరిక జారీ
- అప్రమత్తమైన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్ దక్షిణ ద్వీపాన్ని బుధవారం-గురువారం మధ్యరాత్రిలో శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై తొలుత 6.3 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం.. తర్వాత తీవ్రతను 5.9కు సవరించినట్లు న్యూజిలాండ్ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ వెల్లడించింది. భూకంపం అనంతరం తీర ప్రాంతాలకు తొలుత సునామీ హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. తర్వాత పరిస్థితిని సమీక్షించి దానిని అడ్వైజరీ స్థాయికి తగ్గించారు.
ఫియోర్డ్‌లాండ్ సమీపంలో భూకంప కేంద్రం
అధికారుల వివరాల ప్రకారం.. భూకంప కేంద్రం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫియోర్డ్లాండ్కు ప్రధాన ప్రవేశ ద్వారమైన టే అనౌ పట్టణానికి ఉత్తరంగా సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమెరికా భూకంప పరిశోధనా సంస్థ (USGS), జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) కూడా ఈ భూకంప తీవ్రతను 5.9గా నిర్ధారించాయి. భూకంపం భూమికి సుమారు 50 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు వెల్లడించాయి.
Also Read
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- US-Iran War: 'ట్రంప్‌ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- JD Vance-Iran: జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
భూకంపం తీవ్రతను తిరిగి అంచనా వేసిన అనంతరం న్యూజిలాండ్ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ (NEMA) సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా కీలక ప్రకటన చేసింది. ‘‘ఫియోర్డ్‌లాండ్ సమీపంలో సంభవించిన భూకంప తీవ్రతను 5.9గా సవరించాం. అందువల్ల ముందుగా జారీ చేసిన సునామీ హెచ్చరికను తగ్గించి జాతీయ స్థాయి అడ్వైజరీగా మార్చాం.’’ అని వెల్లడించింది.
న్యూజిలాండ్ సివిల్ డిఫెన్స్ శాఖ ప్రకారం.. భూకంపం ప్రభావంతో తీర ప్రాంతాల్లో అసాధారణ సముద్ర ప్రవాహాలు, బలమైన అలలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈత కొట్టేవారు, సర్ఫింగ్ చేసేవారు, చేపలు పట్టేవారు సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ప్రజలు తక్షణమే నీటి నుంచి బయటకు రావాలని సూచించింది. అలాగే బీచ్‌లు, నౌకాశ్రయాలు, మరీనాలు, నదీ ముఖద్వారాలు వంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.
ప్రత్యేక సూచనలు
సముద్రంలో లేదా మరీనాల్లో బోట్లలో ఉన్నవారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని, అధికారుల అనుమతి వచ్చే వరకు తిరిగి బోట్లలోకి వెళ్లవద్దని సివిల్ డిఫెన్స్ శాఖ స్పష్టం చేసింది. అయి తీర ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం లేదని, స్థానిక అధికారులు ప్రత్యేకంగా ఆదేశిస్తే తప్ప ఇతర ప్రాంతాల ప్రజలు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ప్రస్తుతం అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలు అధికారిక హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
-
UP: ఘజియాబాద్‌లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
-
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
-
Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
-
Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!