New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Zealand Test Squad: నవంబర్ 19 నుంచి భారత్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ జరగబోతుంది. ఈ టెస్ట్ సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టుకు టామ్ లాథమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్ట నున్నాడు. వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత క్రైస్ట్‌చర్చ్‌లోని హెగ్లీ ఓవల్‌లో రెండో టెస్ట్ జరగనుంది.
2024లో భారత గడ్డపై న్యూజిలాండ్ చారిత్రాత్మక విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియాను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆ సిరీస్ తర్వాత ఇరు జట్లు తొలిసారి రెడ్ బాల్ క్రికెట్లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ బోర్డు పూర్తి స్థాయి జట్టును ఎంపిక చేసింది. అయితే ముగ్గురు కీలక ఆటగాళ్లు ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్నారు. తొలి టెస్ట్ నాటికి వారు పూర్తి ఫిట్నెస్ సాధిస్తారని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. వారిలో టామ్ బ్లండెల్ క్వాడ్రిసెప్స్ గాయం, డెవాన్ కాన్వే కంకషన్ సమస్య, రచిన్ రవీంద్ర భుజం గాయం నుంచి కోలుకుంటున్నారు. వీరు తొలి టెస్ట్‌కు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు గాయాల కారణంగా బెన్ సియర్స్, జాక్ ఫాల్క్స్, విల్ ఓ రూర్క్ జట్టుకు దూరమయ్యారు. దీంతో వారి స్థానంలో జాకబ్ డఫీకి అవకాశం కల్పించారు.
Also Read
- AP High Court: పండుగలు, సెలవుల్లో బస్సు టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
- Astrology: నవంబర్ 11 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
- CII Summit: విశాఖ వేదికగా 'సీఐఐ సమ్మిట్–2026'.. ఏపీ పారిశ్రామిక ప్రగతికి నయా రూట్ మ్యాప్..
- Group 2 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల..
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన కనపరిచింది. 14 ఏళ్ల తర్వాత స్వదేశంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూడని రికార్డును కొనసాగించింది. ఈ సిరీస్‌లో కైల్ జేమీసన్, నాథన్ స్మిత్, మాట్ హెన్రీ బౌలింగ్‌లో సత్తా చాటారు. మరోవైపు టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్‌లో సెంచరీలు సాధించారు. ఈ సిరీస్ టామ్ బ్లండెల్‌కు కూడా ప్రత్యేకంగా నిలవనుంది. ఇప్పటివరకు 48 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అతడు, క్రైస్ట్‌చర్చ్‌లో జరగనున్న రెండో టెస్ట్‌తో 50 టెస్టుల మైలురాయిని చేరుకోనున్నాడు. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే అతడి ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఆటగాళ్లే కాకుండా మరోవైపు ఇక ఈ సిరీస్‌కు న్యూజిలాండ్ కోచింగ్ స్టాఫ్‌లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. హెడ్ కోచ్ రాబ్ వాల్టర్‌తో పాటు బౌలింగ్ కోచ్ జాకబ్ ఓరమ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇప్పటికే బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న ల్యూక్ రోంచీతో పాటు కొత్తగా నియమితులైన బీజే వాట్లింగ్ కూడా కోచింగ్ బృందంలో చేరనున్నారు. నవంబర్ 16 నుంచి బీజే వాట్లింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. స్వదేశీ ప్రేక్షకుల సమక్షంలో టెస్ట్ మ్యాచ్‌లు ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రాబ్ వాల్టర్ తెలిపారు.
న్యూజిలాండ్ జట్టు:
టామ్ లాథమ్ (C), టామ్ బ్లండెల్ (WK), డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.
తాజావార్తలు
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
EPS Pension Hike: EPS పెన్షనర్లకు గుడ్ న్యూస్.. రూ.3,000 కనీస పెన్షన్‌పై నవంబర్ 19న కీలక నిర్ణయం..!
-
AP High Court: పండుగలు, సెలవుల్లో బస్సు టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
-
Pete Hegseth: ప్రతిపక్షానికి ఎదురుదెబ్బ.. పీట్ హెగ్సెత్‌పై అభిశంసన ప్రయత్నం విఫలం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Astrology: నవంబర్ 11 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
ట్రెండింగ్
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!