Site icon NTV Telugu

TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాలో కొత్త ట్విస్ట్..

Tamilisai

Tamilisai

TSPSC: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ పదవికి జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయడం.. ఆయన రాజీనామాను గవర్నర్‌ తమిళిసై ఆమోదించి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపినట్టు కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి.. అయితే, జనార్ధన్‌ రెడ్డి రాజీనామా వ్యవహారంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్‌ వచ్చి చేరింది.. జనార్ధన్‌ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని రాజభవన్ వర్గాలు వెల్లడించాయి. పేపర్ లీకేజ్ కి బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామాను ఆమోదించవద్దని రాష్ట్ర గవర్నర్ తమిళసై నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం..

Read Also: Animal Collections: సెకండ్ మండే కూడా 20 కోట్లు కలెక్ట్ చేసింది… ఊహించని రికార్డ్ ఇది

అయితే, పేపర్ లీకేజీతో, నిరుద్యోగుల దురవస్థతో ఈ టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని గతంలోనే రాష్ట్రపతికి లేఖ రాశారు గర్నవర్‌ తమిళిసై.. ఆ లేఖను DoPT (డీఓపీటీ)కి ఫార్వర్డ్ చేసింది రాష్టపతి భవన్.. DoPT ద్వారా అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి వారి స్టాండ్ కోరుతూ గతంలోనే లేఖ అందినట్టుగా తెలుస్తుండగా.. గత ప్రభుత్వం దానిపై స్పందించలేదట.. ఇక, ఇప్పుడు.. కోర్టు కేసులు, గతంలో తాను చేసిన సూచన పెండింగ్ లో వుండగానే.. జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయడంపై గవర్నర్‌ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.. నిరుద్యోగులకు, విద్యార్థులకు న్యాయం జరగకుండానే.. జనార్దన్ రెడ్డి రాజీనామా ఆమోదించడం ఎలా అని గవర్నర్ ప్రశ్నించారట.. రాజీనామాను తాను ఆమోదించలేదు అని గవర్నర్ తేల్చి చెప్పినట్లు రాజ్ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది..

Read Also: Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

మరోవైపు, త్వరలోనే.. సీఎస్‌కు లేఖ రాయడం ద్వారా జనార్ధన్‌రెడ్డి రాజీనామాపై తెలంగాణ ఏర్పడిన కొత్త ప్రభుత్వం స్టాండ్ ఏంటి? అనేది గవర్నర్‌ తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు.. అంతేకాకుండా.. ఈ వ్యవహారంలో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారని సమాచారం.. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో పేపర్‌ లీకేజీలకు భాధ్యత ఎవరు వహిస్తారు? అని గవర్నర్ ప్రశ్నించారట.. ఎన్నో అవస్థలకు గురైన, ఆత్మ హత్య లకు పాల్పడిన అభ్యర్థులకు న్యాయం ఎలా జరుగుతుందని ఆవేదన వెలిబుచ్చారట.. కొత్తగా ఉన్నత స్థాయిలో మరో విచారణ కమిటీ వేసి బాధ్యులను గుర్తించి, శిక్షించి, మరో సారి ఇలాంటి లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా.. కఠిన చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగుల పట్ల భాధ్యతగా వ్యవరించి, వారికి న్యాయం చేయాలని గవర్నర్‌ తమిళిసై సూచించినట్టు రాజ్‌భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా, జనార్ధన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌ ఆమోదించకపోవడంతో.. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో కొత్త ట్విస్ట్‌ వచ్చి చేరినట్టు అయ్యింది.

Exit mobile version