తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ పదవికి జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయడం.. ఆయన రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదించి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపినట్టు కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి.. అయితే, జనార్ధన్ రెడ్డి రాజీనామా వ్యవహారంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. జనార్ధన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని రాజభవన్ వర్గాలు వెల్లడించాయి.