Nani : నేచురల్ స్టార్ నాని గత ఏడాది డిసెంబర్ లో “హాయ్ నాన్న” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “సరిపోదా శనివారం” అనే సినిమా చేస్తున్నాడు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేంగా జరుగుతుంది.ఈ సినిమా ఆగష్టు చివరి వారంలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే హీరో నాని “సాహో” ఫేమ్ సుజీత్ డైరెక్షన్ మరో యాక్షన్ మూవీకి కమిట్ అయిన విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అయితే తాజాగా ఈ సినిమాకు బడ్జెట్ సమస్యలు తలెత్తాయని తెలుస్తుంది.సుజీత్ ఈ సినిమాను గ్యాంగ్‌స్టర్ మాఫియా కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే సినిమా బడ్జెట్ దాదాపు వంద కోట్లు దాటుతుందని తెలుస్తుంది. అంత బడ్జెట్ వర్కౌట్ అవ్వదని సదరు నిర్మాత చేతులెత్తేశారట. దీంతో సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.కానీ ఈ సినిమాని ఎలాగైనా తీయాలనే ఉద్దేశంతో సుజీత్ ఉన్నట్లు తెలుస్తుంది దీంతో మరో రెండు ప్రముఖ బ్యానర్స్ అయిన సితార ఎంటర్టైన్‌మెంట్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ రెండు బ్యానర్స్ తో నాని గతంలో సినిమాలు చేయడంతో ఈ సినిమాపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.మరి ఈ సినిమాకు వారు ఓకే చెబుతారో లేదో చూడాలి.