ఇప్పటివరకు అనేక అధ్యయనాలలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ గుండెపోటు ప్రమాదాలకు గురవుతారని కనుగొన్నారు. అయితే.. తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో మెనోపాజ్ (రుతుక్రమం ఆగిపోవడం) అనుభవించిన స్త్రీలు గుండె సంబంధిత వ్యాధులు పట్ల తక్కువగా ప్రభావితం అవుతారని వెల్లడైంది. వారి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయని.. దీని ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనం తెలిపింది. ఒక స్త్రీ రుతుస్రావం శాశ్వతంగా ఆగిపోయినప్పుడు దానిని మెనోపాజ్ అంటారు. ఇది సహజమైన ప్రక్రియ.. రుతువిరతికి ముందు వచ్చే పరివర్తన దశను పెరిమెనోపాజ్ అంటారు.
Reda Also: PM Modi : అది కాంగ్రెస్ నుంచి ఆశించడం పెద్ద తప్పు.. రాజ్యసభలో మోడీ ఫైర్
ఈ అధ్యయనంలో స్త్రీలు తమ జీవితకాలంలో ఎక్కువ భాగం గుండెపోటు లేదా స్ట్రోక్‌తో చనిపోవడానికి పురుషుల కంటే తక్కువ అవకాశం కలిగి ఉంటారు. యుక్తవయస్సు తర్వాత ఈ ప్రమాదం పురుషుల కంటే ఎక్కువగా ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ సర్క్యులేషన్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో.. 55 ఏళ్ల వయస్సులో లేదా ఆ తర్వాత రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలకు గుండెపోటు, స్ట్రోకులు వచ్చే అవకాశం గణనీయంగా తక్కువగా ఉందని వెల్లడైంది. అధ్యయనం ప్రకారం.. మెనోపాజ్ ఆలస్యంగా ప్రారంభం అవడం శారీరక ప్రయోజనాలను అందిస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రయోజనాలను కలిగించే నిర్దిష్ట విధానాలు కూడా పరిశోధించారు. ఈ విధానాల ద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని.. ఆహార చికిత్సలతో సహా కొత్త చికిత్సలకు దారి తీసే అవకాశం ఉంది.
Reda Also: Plane Crash: మధ్యప్రదేశ్‌లో కూలిన యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లకు గాయాలు
ఈ అధ్యయనంలో 92 మంది మహిళలు పాల్గొన్నారు. వారు వాస్కులర్ ఆరోగ్యాన్ని పరీక్షించారు. ప్రత్యేకంగా.. బ్రాచియల్ ఆర్టరీ ఫ్లో-మెడియేటెడ్ డైలేషన్ (FMD) అనే కొలత ద్వారా, వారి రక్త ప్రవాహంతో ధమనుల పొడవు, వ్యాకోచనం ఎలా ఉందో పరిశీలించారు. రుతుక్రమం ఆగిపోయిన మహిళల రక్తనాళాలు.. రుతుక్రమం ఆగనివారి కంటే ఆరోగ్యకరంగా ఉన్నాయి. పీరియడ్స్ వచ్చినప్పుడు.. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంలో క్షీణత పెరుగుతుందని పరిశోధకులు నివేదించారు. అధ్యయనంలోని తాజా వివరాలు ప్రకారం.. మెనోపాజ్ అనుభవించిన 10% మందికి గుండె జబ్బుల ప్రమాదం తగ్గి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొనబడింది.