NTV Telugu Site icon

Indian Railways: ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఎఫెక్ట్.. రైల్వే కీలక నిర్ణయం

Delhistampede

Delhistampede

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట తర్వాత భారతీయ రైల్వే కీలకమైన చర్యలు తీసుకోనుంది. దేశవ్యాప్తంగా 60 రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో శాశ్వత హోల్డింగ్ జోన్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు.. రద్దీని నియంత్రించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. రైల్వే అధికారులకు ప్రత్యేక శిక్షణ అందించడం, ప్రయాణీకుల సురక్షితం కోసం మార్గదర్శకాలు ఇవ్వడం అవసరం.. ఈ ప్రక్రియలో బాణం గుర్తులను ఉపయోగించడంతో పాటు.. డివైడర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా, ప్రయాగ్‌రాజ్‌కు అనుసంధానిత 35 రైల్వే స్టేషన్లలో ఎక్కువగా రద్దీ ఉంటుంది. ఇది రైల్వే సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నారు.

Read Also: Vivo V50: కేక పుట్టించే ఫీచర్లతో.. మార్కెట్ లోకి విడుదలైన వివో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని ప్లాట్‌ఫాం నంబర్ 16పై శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు రైలు ఎక్కడం కోసం ఇరుకైన ఫుట్ పాత్ వైపు పరుగెత్తారు. దీనితో ఫుట్ పాత్ ఎక్కేవారికి, దిగేవారికి మధ్య తొక్కిసలాట జరిగింది. దీంతో.. 18 మంది చనిపోవడమే కాకుండా.. అధిక సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సీసీటీవీ ఫుటేజ్, ఇతర పత్రాలను పరిశీలిస్తోంది. జనసమూహ నియంత్రణ కోసం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో 200 కొత్త సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో.. ఫుట్ పాత్, బ్రిడ్జిలపై నడిచే వ్యక్తులను పర్యవేక్షించవచ్చు.

Maruti Shift : మారుతి షిఫ్ట్ కారు కొనాలని చూస్తున్నారా.. డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి..ఈఎంఐ పూర్తి వివరాలు ఇవే !

మరోవైపు.. ఈ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రద్దీని నియంత్రించేందుకు ఫిబ్రవరి 26 వరకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని కౌంటర్ ద్వారా ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల అమ్మకం నిలిపివేశారు. ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్ల ద్వారా టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాగ్‌రాజ్‌కి వెళ్లే అన్ని ప్రత్యేక రైళ్లు ప్లాట్‌ఫాం నంబర్ 16 నుండి నడుపుతున్నారు. ప్రయాణీకులు అజ్మేరీ గేట్ నుండి స్టేషన్‌లో ప్రవేశించాలని రైల్వే అధికారులు సూచించారు.