Site icon NTV Telugu

RBI: మీ దగ్గర పాతనోట్లు ఉంటే వెంటనే బ్యాంకులో మార్చుకోండి.. షరతులు వర్తిస్తాయి

New Currency Notes

New Currency Notes

RBI: ఏ కరెన్సీ నోట్లనైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. అయితే నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నోట్లకు సంబంధిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీ కోసం ఒక ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీంతో మీరు కొత్త నోట్లను పొందవచ్చు. ఈ నోట్లకు సంబంధించిన సమాచారాన్ని బ్యాంకు ట్వీట్ చేయడం ద్వారా తెలియజేసింది. మీరు పాత లేదా మ్యుటిలేటెడ్ నోట్లను మార్చాలనుకుంటే, ఇప్పుడు సులభంగా ఆ పని చేయగలరని PNB తన అధికారిక ట్వీట్‌లో రాసింది. మీ దగ్గరలోని బ్రాంచ్‌ను సంప్రదించవచ్చని బ్యాంక్ తెలిపింది. ఇక్కడ మీ దగ్గరనున్న నోట్లు, నాణేలను మార్చుకోవచ్చు.

Read Also:Amazon: ఇకపై అమెజాన్ నుంచి డ్యామేజుడ్ ప్రోడక్ట్స్ డెలివరీలు ఉండవు..అంతా ఏఐ పుణ్యమే..

రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన రూల్స్ రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనల ప్రకారం, మీ దగ్గర కూడా పాత లేదా మ్యుటిలేటెడ్ నోట్లు ఉంటే ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇప్పుడు మీరు బ్యాంకులోని ఏదైనా శాఖను సందర్శించడం ద్వారా అటువంటి నోట్లను మార్చుకోవచ్చు. మీ నోట్‌ని మార్చుకోవడానికి ఎవరైనా బ్యాంకు ఉద్యోగి నిరాకరిస్తే, మీరు దీనిపై ఫిర్యాదు కూడా చేయవచ్చు. నోటు పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే, దాని విలువ తగ్గుతుందని గుర్తుంచుకోండి.

Read Also:Naresh : పవిత్ర ను లిప్ లాక్ కోసం ఒప్పించడానికి చాలా కష్ట పడ్డాను…!!

RBI ప్రకారం, ఏదైనా చిరిగిన నోటులో కొంత భాగం కనిపించకుండా పోయినప్పుడు లేదా రెండు కంటే ఎక్కువ ముక్కలను కలిగి ఉండి ఒకదానితో ఒకటి అతికించబడినప్పుడు మాత్రమే అంగీకరించబడుతుంది. కరెన్సీ నోట్‌లోని కొన్ని ప్రత్యేక భాగాలు, అంటే జారీ చేసే అధికారం, హామీ, వాగ్దాన నిబంధన, సంతకం, అశోక స్తంభం, మహాత్మా గాంధీ చిత్రం, వాటర్‌మార్క్ మొదలైనవి కూడా లేకుంటే, మీ నోటు మార్చబడదు. చాలా కాలంగా మార్కెట్‌లో చలామణిలో ఉండడంతో నిరుపయోగంగా మారిన నాసిరకం నోట్లను కూడా మార్చుకోవచ్చు. బాగా కాలిపోయిన నోట్లను బ్యాంకులు తీసుకోవు.. వాటిని ఆర్‌బిఐ ఇష్యూ కార్యాలయానికి తీసుకెళ్లాలి. ఆ సమయంలో మీ నోట్‌కు జరిగిన నష్టం నిజమైనదేనని, ఉద్దేశపూర్వకంగా దెబ్బతినలేదని సంస్థ ఈ విషయాలను ఖచ్చితంగా తనిఖీ చేస్తుంది.

Exit mobile version